‘బిగ్‌బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
October 3, 2020 / 03:14 PM IST
|Follow Us
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన అందం స్వాతి దీక్షిత్. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ భామ… తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇంట్లో తెలుగులో మాట్లాడే అమ్మాయిలు తక్కువగా ఉన్న సమయంలో స్వాతి వచ్చి గలగల తెలుగు మాట్లాడుతూ ఆకర్షిస్తోంది. వచ్చిన తొలి వారంలోనే నామినేట్ అయినా… ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆడుతోంది. అయితే చూడటానికి పక్క రాష్ట్రం అమ్మాయిలా కనిపించినా మన తెలుగు పిల్లే. ఇంకా ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.
* స్వాతి దీక్షిత్ నట ప్రయాణం 2009లోనే మొదలైంది. ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన ‘అందమైన భామలు’ కార్యక్రమంలో టైటిల్ విజేతగా నలిచింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్ కూడా చేసింది. ‘సూపర్ 2’ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది.
* బాలనటిగా ఓ రెండు సినిమాలు చేసిన స్వాతి… 2013లో ‘బ్రేకప్’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. అయితే 2012లోనే ‘తోర్ నామ్’ అనే బెంగాళీ సినిమాలో నటించింది. ఇది తెలుగులో మంచి విజయం అందుకున్న ‘కొత్త బంగారు లోకం’ సినిమాకు రీమేక్.
* ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘పట్టపగలు’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయినా విడుదల కాలేదు. ఈ సమయంలోనే స్వాతి ‘జంప్ జిలానీ’ (2014) , ‘లేడీస్ అండ్ జెంటిల్మన్’ (2015) సినిమాల్లో నటించింది.
* రెండేళ్ల గ్యాప్ తర్వాత అంజలి నటించిన ‘చిత్రాంగధ’లో కనిపించింది స్వాతి. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. తమిళ చిత్ర పరిశ్రమలో స్వాతి అదృష్టం పరీక్షించుకుంది. ‘శతుర అది 3500’, ‘సింబ’ సినిమాల్లో నటించింది.
* స్వాతి దీక్షిత్ సొంతూరు హైదరాబాద్. మార్చి 20, 1992న జన్మించింది. చిన్నతనంలో తండ్రి చనిపోయాడు.
* స్వాతికి యోగా చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. స్క్రోల్ చేసేకొద్దీ ఆమె యోగా ఫొటోలు, కసరత్తుల పిక్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఆమె ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ కూడా.
* చాలామంది హీరోయిన్లలాగే స్వాతికి కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గర విస్కీ, కిజ్జీ అనే ఓ కుక్క పిల్ల, పిల్లి పిల్ల ఉన్నాయి.
* స్వాతికి టూర్లంటే చాలా ఇష్టం. వీలుచిక్కిన్నప్పుడల్లా టూర్లకు వెళ్లిపోతుంటుంది. గోవా నుంచి జోర్డాన్ వరకు ఆమె చూడని ప్రదేశమంటూ లేదు. ఎక్కడికెళ్లినా ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం మాత్రం మరవదు.
* నిజానికి స్వాతి దీక్షిత్ ఇప్పటికే బిగ్‌బాస్‌లోకి రావాల్సింది. గతంలో రెండుసార్లు బిగ్‌బాస్ టీమ్‌ను ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఒకసారి గాయపడటంతో రాలేకపోయారట. ఇంకోసారి ఇతర కారణాల వల్ల అందుబాటులో లేకుండా పోయింది.
* స్వాతి ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అదే బయట స్నేహితులతో చాలా సరదాగా ఉంటుందట. ఎక్కడికెళ్లినా గెలిచొచ్చే తత్వమట.
* స్వాతి దీక్షిత్ చాలా యాడ్స్‌లో నటించినా జోయ్ అలుక్కాస్ యాడ్‌తో బాగా పాపులర్ అయ్యింది. అచ్చ తెలుగు చీరకట్టులో ఆమె ఆ యాడ్‌లో కనిపించిన తీరుకు అందరూ ముగ్దలయ్యారు.
* స్వాతి దీక్షిత్ వంట చేయడం అంటే ఇష్టం. డైట్ ఉప్మా, కాజు ఖీర్, ఉప్మా… ఇలా ఒకటేంటి రకరకాల వంటలు చేస్తుంటుంది. అందరిలాగే ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ షేర్ చేసి మురిసిపోతుంది.
* స్వాతి అందరి దేవుళ్లను పూజిస్తుంది. దేవాలయానికి వెళ్తుంది, చర్చికి వెళ్తుంది, అల్లాకు ప్రార్థన కూడా చేస్తుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రార్థన స్థలాలను తప్పకుండా విజిట్ చేస్తుంది.
* ఆమె ఎంత ఫిట్‌గా ఉంటుంది అంటే… రెండు చేతులను వీపు వెనక్కి తీసుకెళ్లి నమస్కారం పెట్టగలరు. వంటిని విల్లులా వంచి ఇంద్రధనస్సుతో పోటీపడగలదు.
* స్వాతి మంచి ఫుడీ. ఇడ్లీ, రెడ్ వెల్వెట్ కేక్, ఐస్‌క్రీమ్, గులాబ్ జామూన్ అంటే చాలా ఇష్టం. అయితే పుడ్ విషయంలో ఎంత పక్కాగా ఉంటుందో, దానికి తగ్గట్టే వర్కవుట్ చేస్తూ ఫిట్‌గా ఉంటోంది.