రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!
September 26, 2022 / 02:06 PM IST
|Follow Us
ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ చిత్రంలో భద్రం పాత్ర పోషించిన నటుడు చంద్రశేఖర్ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఒక్క ‘బాహుబలి'(సిరీస్) లో తప్ప రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ.. ఇతను నటించాడు. అంతకు ముందు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన చంద్రశేఖర్ కు అలాగే డైరెక్టర్ గా రాజమౌళికి మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెంబర్1’ కావడం విశేషం. అయితే ఇతను ‘బాహుబలి'(సిరీస్) లో ఎందుకు నటించలేదు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
నిజానికి ‘బాహుబలి’ లో కూడా ఇతని పాత్ర ఉందట. కానీ ఆ పాత్ర సినిమాకి అడ్డంకిగా ఉంటుందని.. రాజమౌళి చెప్పాడట. అలాంటి పాత్రలో నటించడానికి చంద్రశేఖర్ కు కూడా ఇష్టం లేకపోవడంతో రాజమౌళి మాటకి విలువిచ్చి ఆ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడట. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో మాత్రం చంద్రశేఖర్ పాత్ర ఉందట. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. చంద్రశేఖర్ భార్య గురించి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.
ఈమె పేరు నిలీయ భావాని. ఈమె కూడా సినీ నటే కావడం విశేషం. ‘పండగ చేస్కో’ ‘కిక్2’ ‘సైరా’ ‘నాని జెంటిల్మెన్’ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఖమ్మం కు చెందిన నీలియా భవాని చంద్ర శేఖర్ ను ప్రేమించిందట. కానీ ఆమె తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. అయితే తరువాత ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి.. పెళ్లి చేసుకున్నారట. అటు తరువాత చంద్రశేఖర్ కూడా సినిమాల్లో బిజీ అవ్వడం జరిగినట్టు తెలుస్తుంది.