‘కార్తీక దీపం’ ఫేమ్ నిరుపమ్ గురించి మనకు తెలియని నిజాలు!
December 25, 2021 / 04:27 PM IST
|Follow Us
‘కార్తీక దీపం’ … ఈ సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సీరియల్స్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సీరియల్ ఇది. బుల్లితెర నటులకు కూడా పెద్ద స్థాయిలో క్రేజ్ ఏర్పడేలా చేసిన సీరియల్ ఇది. ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలైన తరువాత అందరూ ఒకటే డౌట్ ను దేశం మొత్తం ట్రెండ్ అయ్యేలా చేసారు.అదే ‘కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు’ అని..! ఇక ‘ కార్తీక దీపం’ సీరియల్ వచ్చిన సంవత్సరం తరువాత నుండీ కూడా ఒక ప్రశ్న తెగ ట్రెండ్ అవుతుంది. అదే ‘డాక్టర్ బాబు … దీపని ఎప్పుడు చేరదీస్తాడు?’ అని..! దీని పై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి… వస్తున్నాయి..! సరే ఆ సంగతి పక్కన పెట్టేస్తే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర పోషిస్తున్న నిరుపమ్ పరిటాల గురించి ఆశక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం:
1) నిరుపమ్ పరిటాల మరెవరో కాదు నిన్నటి తరం నటుడు, రచయిత అయిన ఓంకార్ కొడుకు. నిజానికి ఓంకార్ గారికి నిరుపమ్ ను నటుడిని చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ లేదట. కానీ నిరుపమ్ కు మాత్రం సినిమాల్లో నటుడు అవ్వాలనేది డ్రీం. అది ఫుల్ ఫిల్ చేసుకునే లోపే ఓంకార్ గారు కన్ను మూశారు. దాంతో సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలి అనే ఆశ నెరవేర లేదు నిరుపమ్ కు..! అయితే అతని తండ్రి గారి స్నేహితుడు ద్వారా ‘చంద్రముఖి’ అనే సీరియల్ లో ఆఫర్ వచ్చిందట.
2) చంద్రముఖి సీరియల్ లో లీడ్ యాక్ట్రెస్ గా చేసిన మంజులను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు నిరుపమ్.వీళ్లిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.
3) చెన్నై లో ఇంజినీరింగ్ చేసిన తరువాత ఎం.బి.ఎ కూడా చేసాడు నిరుపమ్.
4) ‘నెక్స్ట్ నువ్వే’ అనే చిత్రానికి స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేశాడట నిరుపమ్.
5) జీ తెలుగు లో టెలికాస్ట్ అయ్యే ‘ప్రేమ’ అనే సీరియల్ తో నిర్మాతగా కూడా మారాడు నిరుపమ్.
6) ‘కార్తీక దీపం’ సీరియల్ లో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్ర కోసం ముందుగా నిరుపమ్ ను అనుకోలేదట.నిజానికి ఆ పాత్ర కోసం నిరుపమే ముగ్గురు ఆర్టిస్ట్ లను రికమండ్ చేసి పంపాడట. కానీ వాళ్ళెవ్వరూ ఆ పాత్రకు సరిపోవడం లేదు అని నిర్మాత చెప్పడం.. అలాగే ‘నువ్వే ఈ పాత్ర చెయ్యాలి’ అని రిక్వెస్ట్ చెయ్యడంతో ఆ పాత్ర ఇతనికి దక్కినట్టు తెలుస్తుంది.
7)’కార్తీక దీపం’ సీరియల్ లో నిరుపమ్ నటన నచ్చడంతో చిరంజీవి,పవన్ కళ్యాణ్ తల్లిగారు అయిన అంజనా దేవి గారు.. పవన్ కళ్యాణ్ మామిడి తోట నుండీ మామిడిపళ్లు ప్యాక్ చేయించి నిరుపమ్ కు పంపారట.