Upasana: పిల్లలు పుట్టిన తరువాత ఉపాసన జాతకం మారబోతోందా!
June 12, 2023 / 09:09 PM IST
|Follow Us
మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా పది సంవత్సరాల తరువాత ఈమె ప్రెగ్నెంట్ కావడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెలలో మెగా ఇంటిలోకి వారసుడు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె జాతకం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఉపాసనకు మగబిడ్డ పుట్టాలని అందరూ భావిస్తున్నారు.
మగబిడ్డ పుడితే మెగా లెగసీ అలాగే కొనసాగుతుందని భావిస్తున్నారు.అయితే మగ బిడ్డ పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతుందని కూతురు పుడితే మరోలా ఉండబోతుందని తెలుస్తోంది. ఉపాసనకు కొడుకు పుడితే ఆమె కొడుకు తన తండ్రి తాత కన్నా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని, తన కొడుకు ఉన్నత స్థానంలో గుర్తింపు సంపాదించుకుంటారని వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా కొడుకు కాకుండా కూతురు కనక పుడితే మెగా ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయని, డబ్బు పరంగా మెగా కుటుంబానికి మంచిగా కలిసి వస్తుందని ఓ వార్త వైరల్ గా మారింది.ప్రముఖ జ్యోతిష్యులు ఉపాసన జాతకాన్ని చూసే ఆమెకు పుట్టబోయే బిడ్డ ద్వారా తన కుటుంబ పరిస్థితులు తన జాతకం కూడా మారబోతుందని చెప్పినట్టు సమాచారం.
ఇలా ఉపాసన (Upasana) గురించి తనకు పుట్టబోయే బిడ్డ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను తిప్పికొడుతున్నారు ఇవన్నీ కేవలం అవాస్తవాలు మాత్రమేనని ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.ఏది ఏమైనా మెగా కుటుంబంలోకి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారన్న వార్త అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించడం మాత్రం నిజమని చెప్పాలి.