Upasana, Vijay: హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పై రియాక్ట్ అయిన ఉపాసన!
February 7, 2024 / 06:28 PM IST
|Follow Us
మెగా కోడలు ఉపాసన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకవైపు తన వ్యాపారలను కొనసాగిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సామాజిక సేవ కార్యక్రమాలు కనుక చూస్తే ఈమె కూడా రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న సందేహాలు కలగక మానదు. తాజాగా ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఉపాసనకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె హీరో విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ గురించి కూడా కామెంట్ చేశారు. హీరో విజయ్ సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం అని ఈమె తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా మార్పును కోరుకుంటే అధికారంలో ఎవరున్నారు అనేది చూడకుండా వారిని సపోర్ట్ చేయండి లేదంటే సపోర్ట్ చేసే వారిని కూడా వెనక్కి లాగకండి అంటూ ఈమె తెలిపారు.
మార్పు రావాలనుకున్నప్పుడు కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవాలని తమిళనాడులో కూడా ఈ మార్పు మొదలవుతుందని ఈమె తెలిపారు. సామాజిక సేవ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా ఉండే ఉపాసన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ప్రశ్నలు ఎదురుగా ఈమె సమాధానం చెబుతూ నాకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలు ఏమాత్రం లేవని తెలిపారు. కానీ మార్పును తీసుకువచ్చే నాయకుడికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అంటూ ఈ సందర్భంగా (Upasana) ఉపాసన రాజకీయాల గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.