Allu Arjun Pushpa Movie: పుష్ప మూవీ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

  • June 29, 2021 / 06:33 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లు కావడంతో పుష్ప సినిమాకు దేవీ శ్రీ సంగీతం అదనపు ఆకర్షణ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ ఏడాదే పుష్ప పార్ట్ 1 రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియోల సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో ఆగష్టు 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. ఇప్పటికే పుష్ప మూవీ షూటింగ్ 90 శాతం పూర్తైందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం జులై తొలి వారంలో పుష్ప ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఆర్య, ఆర్య 2 సినిమాలను మించి పుష్ప సాంగ్స్ ఉండనున్నాయని దేవీ శ్రీ ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ను సిద్ధం చేశారని సమాచారం.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఫహాద్ ఫాజిల్ విలనిజం ఈ మూవీకి హైలెట్ కానుందని ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సంబంధించిన డేట్, టైమ్ ను త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus