Jr NTR: టీడీపీలోకి ఎన్టీఆర్ రాడు.. వాళ్ళు రానివ్వరు!
August 21, 2021 / 07:23 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో సినీ నటులకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడో ఒక సందర్భంలో లో సెలబ్రిటీలు అటువైపు అడుగులు వేయకుండా ఉండలేరు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రెటీలు కూడా ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి వెళ్ళాక తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే కొన్ని సార్లు తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు.అయితే తారక్ ను కేవలం ప్రచారం అవసరం కోసం మాత్రమే వాడుకోవడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు.
ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ తరహాలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కష్ట సమయంలో పార్టీని ఆదుకునే నాయకుడు కావాలని ఓ వర్గం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందుకోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని కూడా నందమూరి ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ లో చాలా మంది అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇప్పట్లో అయితే తారక్ రాజకీయాల్లోకి రాడు అని చెప్పవచ్చు. అతని మార్కెట్ కూడా ఇప్పుడిప్పుడే పాన్ లెవెల్ లోకి వెలుతోంది.
అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా కూడా పార్టీలోని ప్రముఖులు రానివ్వకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పట్లో అటువైపు వెళ్లడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాడట. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా లేనని కూడా ఒక మాట చెప్పాడు. అంతేకాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పలేదు. మరి భవిష్యత్తులో తాత గారి పార్టీని ఆధీనంలోకి తీసుకుంటాడో లేదో చూడాలి.