Pushpa movie: మరో మూడేళ్ల తరువాతే బన్నీ సినిమా!

  • June 16, 2021 / 04:31 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే పార్ట్ 1 కి సంబంధించి చాలా ఫుటేజ్ ను రూపొందించారు. మరికొన్ని రోజులు షూటింగ్ నిర్వహిస్తే పార్ట్ వన్ పూర్తవుతుంది. అయితే ఈ సినిమా తరువాత బన్నీ పార్ట్ 2 మొదలుపెట్టడానికి కాస్త సమయం తీసుకోబోతున్నారట.

ఈ గ్యాప్ లో బన్నీ మరో సినిమా చేయబోతున్నాడనే విషయాన్ని ఇటీవల బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బన్నీ మరో సినిమా చేస్తే దర్శకుడు సుకుమార్ కూడా అదే రూట్ లో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. పైగా బన్నీ సన్నిహితుడు కేదార్ అనే వ్యక్తికి ఓ సినిమా చేయడానికి సుకుమార్ ఒప్పుకున్నాడట. దీనికోసం సింగిల్ పేమెంట్ తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. ఈ లెక్కన చూస్తే 2020 సంక్రాంతికి లేదా..

వేసవికి ‘పుష్ప 1’ రిలీజైతే.. ఆ తరువాత బన్నీ, సుకుమార్ చెరో సినిమా తీసుకొని మళ్లీ ‘పుష్ప’ సెట్స్ పైకి వస్తారు. అంటే 2023 చివరికి గానీ లేదంటే 2024 ఆరంభంలో గానీ ‘పుష్ప 2’ వచ్చే ఛాన్స్ ఉంది. అది మధ్యలో మళ్లీ ఎలాంటి గ్యాప్ రాకపోతే. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus