ఆ రకంగా చూస్తే ‘ఉప్పెన’ సినిమా సేఫ్ అయిపోయినట్టే..!
September 2, 2020 / 10:49 PM IST
|Follow Us
మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ ‘ఉప్పెన’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసాడు. హీరోలో ఉన్న యాక్టివ్ నెస్ ను చూసో మరేమో కానీ నిర్మాతలు ఈ చిత్రానికి 25 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారట. ఈ బడ్జెట్ లో 8 కోట్లు పెట్టి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఓటిటిలో ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అని చర్చలు జరిపితే 13 కోట్ల నుండీ 15 కోట్ల వరకే ఆఫర్ చేస్తున్నారట.
ఒక వేళ అదే రేటుకి టెంప్ట్ అయ్యి ఓటిటిలో విడుదల చేస్తే.. 10కోట్ల నుండీ 12 కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిజానికి లో బడ్జెట్ సినిమాలను అలాగే పెద్ద హీరోల సినిమాలను ఫ్యాన్సీ రేటుకి కొనడానికి ఓటిటి సంస్థలు ముందుకు వస్తున్నాయి. కానీ వైష్ణవ్ తేజ్ కు హీరోగా ఎంత మార్కెట్ ఉందో తెలీదు. అందుకే ఓటిటి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇక నిర్మాతలు ‘ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తే కనీసం 10కోట్ల వరకూ అయినా బిజినెస్ జరుగుతుంది’ అని భావిస్తున్నారట.
ఇక డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి 18 కోట్లకు అమ్ముకున్నా సేఫ్ అయిపోవచ్చు అని ప్లాన్ చేసుకుంటున్నారట. ఒక రకంగా ఇది వైష్ణవ్ తేజ్ అదృష్టం అనే చెప్పాలి.తన మొదటి సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ దక్కించుకుంటున్నాడు.