ఉప్పెన ట్రైలర్: ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది… దానికి భవిష్యత్ ఉండదు..!
February 4, 2021 / 04:44 PM IST
|Follow Us
మ్యూజికల్ గా మంచి హిట్ అయిన ఉప్పెన సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలకి తగ్గట్లుగానే సినిమా ఉంటుందని ట్రైలర్ లో చూపించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ప్రేమంటే రోమియో జూలియట్ లా, లైలా మజ్నులా, దేవదాస్ పార్వతిల్లా అదో మాదిరిగా ఉండాలిరా.. అంటూ హీరో చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది ఈ ట్రైలర్. విజయ్ సేతుపతి విలనిజం, హీరోయిన్ గ్లామర్ రెండూ కూడా ట్రైలర్ లో హైలెట్ అనే చెప్పాలి.
ప్రేమించుకున్న జంటని హీరోయిన్ తండ్రి ఎలా విడదీశాడు..? హీరో విలన్ ఇద్దరి మద్యలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా వెండితెరపై ఉండబోతోందని చూపించారు. హీరో – హీరోయిన్ – విలన్ ల మధ్యన జరిగే హై డ్రామా ట్రైలర్ లో చూపించారు. అంతేకాదు, ప్రేమంటే పట్టుకోవడం నాన్నా, వదిలేయడం కాదు అనే డైలాగ్, ఆకాశం సముద్రం కలుస్తాయా అని విలన్ అడుగుతుంటే అల ఎంత ఎగిరినా కలవదు అని చెప్పే ఆన్సర్, అయితే ఆకాశం వంగితే అని విలన్ చెప్పే కౌంటర్ డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది.
ఇక లాస్ట్ లో విజయ్ సేతుపతి ప్రేమికుల గురించి చెప్పిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతోంది..? ఏ రేంజ్ లో సినిమాని డైరెక్టర్ వెండితెరపై చూపించబోతున్నాడు అనేది స్పష్టంగా ట్రైలర్ లో చూపించారు. హీరోగా వైష్ణవ్ తేజ్ చాలా డీగ్లామర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నా కూడా కంటెంట్ మొత్తం హీరోతోనే నడుస్తోంది. అలాగే, హీరోయిన్ అందాలు, విజయ్ సేతుపతి చూపించిన విలనిజం, గొంతులో గాంభీర్యం కలిసి ఉప్పెన సినిమా హైప్స్ ని పెంచేస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదిన విడుదల కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుందా లేదా అనేది చూడాలి.