శర్వా.. ‘ఆడవాళ్ళు ‘ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి ఊర్వశి..!

  • February 19, 2022 / 10:53 AM IST

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శర్వానంద్.. ఇప్పుడు ఒక హిట్టు కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ వంటి వరుస డిజాస్టర్లతో శర్వా రేసులో వెనుక పడ్డాడు. అయితే ఇప్పుడు `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంలో…. రాధిక‌, ఊర్వ‌శి, కుష్బు వంటి వారు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Click Here To Watch

‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుదల కాబోతుందని అంటున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో మార్చి 4 కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి ఊర్వశి మాట్లాడి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ” ‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం టైటిలే చాలా పాజిటివ్‌గా ఉంది. టైటిల్ చూడ‌గానే ఆడ‌వారికి ప్రాధాన్యం ఉన్న సినిమా అని అర్ధమయ్యేలా ఉంటుంది.

ఈ సినిమాలో ప్ర‌తీ ఫ్రేములో ఐదుగురు మ‌హిళ‌ల‌కి స‌మాన‌మైన ప్రాధాన్య‌త కలిగించడం. ఎక్క‌డా కూడా ఒక‌రు ఎక్కువ ఒక‌రు త‌క్కువ అనేది ఉండ‌దు. అందరికీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి ఒక స్క్రిప్ట్ రావడం చాలా అరుదు.ఈ చిత్రం కథ ప్రకారం హీరోకి ఐదుగురు త‌ల్లులు ఉంటారు. అందులో ఒక త‌ల్లి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ, అటాచ్మెంట్ ఉంటుంది అది ఎందుకు? ఆ త‌ల్లి ఎవ‌రు? అనేది సినిమాలో మెయిన్ పాయింట్.

భిన్న అభిప్రాయాలు ఉన్న ఐదుగురు త‌ల్లులును ఒప్పించి హీరో త‌న ప్రేయ‌సిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే పాయింట్ ను దర్శకుడు మలిచిన తీరు అలరించే విధంగా ఉంటుంది.రాధిక‌, కుష్బు గారితో ఇప్ప‌టికే చాలా సినిమాల్లో క‌లిసి న‌టించాను. రాధిక పాత్ర మెచ్యూర్డ్‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అంద‌రికీ మంచి చెడులు చెప్ప‌డం ఇలా ఉంటుంది. నా పాత్ర విష‌యానికి వ‌స్తే చాలా ఎమోష‌న‌ల్, ఎక్కువ‌గా మ‌ట్లాడ‌తాను. అన్నింటికి నా ఒపీనియ‌న్ తీసుకోవాలి అనే మెండిత‌నం ఉంటుంది.

అంద‌రిలో నా డెసిష‌న్ ఫైన‌ల్‌గా ఉండాలి అనుకుంటాను. నాకు న‌చ్చ‌క‌పోతే ఏ పని చేయొద్దు అనే ప‌ట్టుద‌ల‌వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. వాటిని ఎలా ప‌రిష్క‌రించారు అనేది ముఖ్యంగా ఉంటుంది” అంటూ ఊర్వశి చెప్పుకొచ్చారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus