చంపేస్తామంటూ హెచ్చరికలు!

  • March 5, 2018 / 11:56 AM IST

ప్రెజంట్ జనరేషన్ సినిమా ఫ్యాన్స్ కి శ్రీదేవి ఎవరో కూడా ఆవిడ చనిపోతేనే తెలిసింది. కానీ.. ఎలాంటి ఇంట్రడక్షన్ లేకుండా అందరికీ సుపరిచితురాలైన ఏకైక నటీమణి ఊర్వశి రొటేలా. ఒకవేళ ఈమె పేరు తెలియకపోయినా అమ్మడిని చూస్తే మాత్రం జనాలు వెంటనే గుర్తుపడతారు. ఆస్థాయి గుర్తింపు సంపాదించుకొన్న సెక్స్ బాంబ్ ఊర్వశికి కొన్ని రోజులుగా నిద్రపట్టడం లేదంట. నిద్ర పట్టట్లేదు అనగానే ఏదో అనుకొనేరు. ఇక్కడ ఆవిడకి నిద్ర పట్టనిది బెదిరింపు కాల్స్ వల్ల.

ఊర్వశి నటించిన తాజా చిత్రం “హేట్ స్టోరీ 4”. విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈవారం అనగా మార్చ్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటివరకూ విడుదలైన ట్రైలర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకోవడమే కాక కుర్రకారును హీటెక్కించాయి. అయితే.. ఇలా కుర్రాళ్లని శృంగారంతో ఆకట్టుకోవడం కొందరికి నచ్చలేదు. “నీ సినిమా రిలీజయ్యిందంటే నిన్ను చంపేస్తాం” అంటూ కాల్స్ రావడం నిన్నట్నుంచి మొదలయ్యిందట. దాంతో భయపడి చస్తుంది సెక్సీ భామ. ఏదో డబ్బుల కోసం దర్శకులు చెప్పినట్లు సిగ్గు, బట్టలు పక్కనెట్టి ప్రేక్షకుల్ని ఆనందపరిచే తనలాంటి సాధారణ నటికి ఇలాంటి బెదిరింపులేంటి అని బాధపడుతోంది.

అమ్మడికి వస్తున్న బెదిరింపు కాల్స్ ఎలా ఉన్నా.. “హేట్ స్టోరీ 4″లో అమ్మడి అందాలు మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి. మరి ఆ అందాలు సినిమా హిట్ అవ్వడానికి ఏమైనా ఉపయోగపడటాయా లేదా అనేది ఈ శుక్రవారం తెలిసిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus