Usha Parinayam Review in Telugu: ఉషాపరిణయం సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 2, 2024 / 09:58 PM IST

Cast & Crew

  • శ్రీకమల్‌ (Hero)
  • తాన్వీ ఆకాంక్ష (Heroine)
  • వెన్నెల కిషోర్‌ , శివాజీ రాజా ,ఆలీ, ఆమని (Cast)
  • కె. విజయ భాస్కర్ (Director)
  • కె. విజయ భాస్కర్ (Producer)
  • ఆర్‌.ఆర్‌. ధృవన్‌ (Music)
  • సతీష్ ముత్యాల (Cinematography)

ఆగస్టు 2ని టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘ఉషాపరిణయం’ మూవీ ఒకటి. ‘స్వయంవరం’ ‘నువ్వేకావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మన్మథుడు’ ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన సీనియర్ స్టార్ డైరెక్టర్ కె.విజయ్ భాస్కర్ తెరకెక్కించిన సినిమా కావడంతో ‘ఉషాపరిణయం’ గురించి ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే చర్చించుకున్నారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారిని ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ : హనుమంతరావు అలియాస్ హనీ(శ్రీ కమల్) ఓ కోర్స్ నిమిత్తం దుబాయ్ కి వెళ్తాడు. అక్కడ కోర్స్ ఫినిష్ చేసి ఇండియాకి వస్తున్న టైంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనంద్(సూర్య శ్రీనివాస్) రిస్క్ చేసి మరీ కాపాడతాడు. దీంతో ఆనంద్… హనీని తన బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ ఓన్ చేసుకుంటాడు. ఇద్దరూ తిరిగి ఇండియాకు వస్తున్న టైంలో హనీ గతం గురించి అడుగుతాడు ఆనంద్. అప్పుడు హనీ తన గతం గురించి ఆనంద్ కి వివరించడం మొదలుపెడతాడు. హైదరాబాద్ కి చెందిన హనీ ఓ ఫ్యాషన్ డిజైనర్. అల్లరి చిల్లరిగా పెరిగిన అతనికి ‘పెళ్లి చేస్తే గాడిలో పడతాడు’ అని భావించి అతని తండ్రి(శివాజీ రాజా) పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు.

ఈ క్రమంలో ఉష(తాన్వీ ఆకాంక్ష) తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కానీ అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. దాంతో ఆ సంబంధం వద్దనుకుంటాడు. దీంతో అతని తండ్రికి కోపం వచ్చి… పాకెట్ మనీ కట్ చేస్తాడు.ఈ క్రమంలో హనీ ఓ జాబ్ వెతుక్కుంటాడు. ఊహించని విధంగా అతను పొందిన జాబ్లో ఉష బాస్ అవుతుంది. ఆ తర్వాత వారి ప్రయాణం ఎటువంటి టర్న్ తీసుకుంది? ఆ తర్వాత ఆనంద్ వీళ్ళ జీవితంలో ఎటువంటి పాత్ర పోషించాడు.? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : హీరో శ్రీకమల్ హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కామెడీ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదు అనిపించాడు. ఒకటి, రెండు సినిమాలకే ఇంత ఇంప్రూవ్మెంట్ చూపించడం అంటే మాటలు కాదు. ఫైట్స్ లో కూడా గ్రేస్ చూపించాడు. హీరోయిన్ తాన్వి ఆకాంక్ష లుక్స్ కూడా బాగున్నాయి. కానీ ఈమెకు డబ్బింగ్ ఎందుకో సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. శివాజీ రాజా, ఆమని..ల సిన్సియర్ నటనలో వారి సీనియారిటీ కూడా కనిపించింది.

అలీ, వెన్నెల కిషోర్..ల కామెడీ ట్రాక్స్ బాగున్నాయి.. వాళ్ళ క్యారెక్టర్స్ లెంగ్త్ ఇంకాస్త పొడిగించి ఉంటే బాగుండేది. రవి శివ తేజ కామెడీ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సూర్య శ్రీనివాస్ బాగా చేశాడు, రోల్ గురించి ఎక్కువ చెబితే స్పాయిలర్ అయిపోతుంది. సుధ వంటి మిగతా నటీనటులు కూడా బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : లవ్, ఫ్యామిలీ, కామెడీ.. వంటి ఎలిమెంట్స్ దర్శకులు కె.విజయ భాస్కర్ కి ప్లస్ పాయింట్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన గత సినిమా ‘మసాలా’ లో తగిన డోసేజ్ లో లేవు. దాని ఫలితం తారుమారు అవ్వడానికి కూడా అదే కారణం అయ్యుండొచ్చు. కానీ ‘ఉషాపరిణయం’ విషయంలో ఆయన అలాంటి మిస్టేక్స్ చేయలేదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దీనిని మలిచారు. యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

సెకండాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. క్లైమాక్స్ ను ముగించిన తీరు బాగుంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ కూడా సినిమా ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా అనిపిస్తుంది. ఇక సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎదురుగా నువ్వుంటే..’ ‘నువ్వులే నువ్వులే’ వంటి పాటలు వినడానికే కాకుండా చూడటానికి కూడా రిచ్ గా అనిపిస్తాయి.

విశ్లేషణ : ఎటువంటి వల్గారిటీ లేకుండా ఓ క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని తీర్చే సినిమా ‘ఉషాపరిణయం’ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

ఫోకస్ పాయింట్ : టైం పాస్ ఎంటర్టైనర్

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus