వి.వి.వినాయక్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్
October 7, 2016 / 11:51 AM IST
|Follow Us
టాలీవుడ్ లో ఫ్యాక్షన్ కథలను పీక్ స్థాయికి తీసుకెళ్లిన డైరక్టర్ వి.వి.వినాయక్. యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన ఘనుడు. సుమోలు పైకి లేపి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన దర్శకుడు. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్ వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలను తెరకెక్కించిన వినాయక్ నేడు (అక్టోబర్ 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫిల్మ్ ఫోకస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వినాయక్ రియల్, రీల్ లైఫ్ సీక్రెట్స్ గురించి స్పెషల్ ఫోకస్..
జన్మస్థలంవివి వినాయక్ పూర్తి పేరు గండ్రోతు వీర వెంకట వినాయక్. స్వస్థలం చాగల్లు గ్రామం (పశ్చిమ గోదావరి జిల్లా). తండ్రి పేరు కృష్ణా రావు. సినిమా ఎగ్జిబిటర్. తల్లి నాగరత్నం, గృహిణి. వినాయక్ తల్లిదండ్రులిద్దరూ స్వర్గస్తులయ్యారు.
వీరాభిమానివినాయక్ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. స్కూల్, కాలేజీకి డుమ్మా కొట్టి చిరు సినిమాలకు వెళ్లేవారు. కొన్నేళ్లు చిరు అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా చేశారు.
మెళకువలుప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ, సాగర్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పదేళ్లు చేశారు. వారి వద్దే డైరక్షన్ లో మెళకువలు నేర్చుకున్నారు.
మొదటి అడుగు ఆదివెండి తెర పై డైరక్టర్ గా వివి వినాయక్ పేరుచూసుకున్న సినిమా ఆది. తొలి చిత్రమే మాస్ ప్రజలను ఉర్రూతలూగించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి, వినాయక్ కి ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సాంబ, అదుర్స్ సినిమాలు వచ్చాయి.
పెద్దల కుదిర్చిన పెళ్లివినాయక్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 5, 2002 న అనంత లక్ష్మి సత్య వతి ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుందన కృష్ణ, హాసిని కృష్ణ.
వినాయక్ థియేటర్వినాయక్ తండ్రి ఎగ్జిబిటర్. వారికీ ఓ సినిమా హాల్ ఉంది. దాని పేరు వినాయక్ థియేటర్. ఆ థియేటర్ వల్లే తనకి సినిమాలపై ప్రేమ మొదలయిందని వినాయక్ చెబుతుంటారు. డైరక్టర్ గా స్థిరపడిన తర్వాత సొంత ఊర్లో నాన్న పేరు మీద వెంకట కృష్ణ అనే థియేటర్ కట్టారు. సెటిమెంట్ కోసం రన్ చేస్తున్నారు.
నటనతన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ చిత్రంలో వినాయక్ ఒక కీలక పాత్ర పోషించారు. దానికి ఆయనకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత వినాయక్ ఎందులోనూ నటించలేదు. ఆసక్తిలేకనే నటించలేదని వినాయక్ వివరించారు.
షార్ట్ ఫిల్మ్ప్రభుత్వం సంస్థ జీవన్ దాన్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా అవయవ దానంపై అవగాహన కోసం ఒక షార్ట్ ఫిల్మ్ ని వినాయక్ డైరక్ట్ చేశారు. ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
ఖైదీ నంబర్ 150మెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే బాధ్యతను వినాయక్ చేతికి అప్పగించారు. ఈ డైరక్టర్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150 ని అభిమానుల అంచనాలకు మించేలా చిత్రీకరిస్తున్నారు.
దాన వీర సూర కర్ణమహానటుడు నందమూరి తారకరామారావు నటించిన అపురూప చిత్రం “దాన వీర సూర కర్ణ”. ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలనీ వినాయక్ భావిస్తున్నారు.