Vaishnav Tej: వైష్ణవ్ తేజ్.. 4వ మూవీకి డైరెక్టర్ మారబోతున్నారా?

  • June 15, 2022 / 01:26 PM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్… ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి డెబ్యూ మూవీతోనే అసాధారణమైన బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా నిలిచాడు. అటు తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే చిత్రం చేశాడు. ఇది పెద్దగా ఆడలేదు. అయితే ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా అని చిత్ర బృందం పరోక్షంగా చెప్పుకొచ్చింది.

నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా అయితే ఈ మూవీ కూడా పెద్ద హిట్ అనే చెప్పాలి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..వైష్ణవ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ్ లో ‘ఆదిత్య వర్మ'(‘అర్జున్ రెడ్డి’ రీమేక్) ను తెరకెక్కించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకుడు. ఇతను సందీప్ రెడ్డి వంగా శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయడానికి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. దీంతో పాటు ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో వైష్ణవ్ ఓ చిత్రం చేయబోతున్నాడు. ‘వరుడు కావలెను’ చిత్రాన్ని తెరకెక్కించిన సాయి సౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు శ్రీకాంత్ అనే మరో కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తాడు అని అంటున్నారు. ఏది ఏమైనా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ అంటే సినిమా మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. కాబట్టి వైష్ణవ్ మంచి లైనప్ నే సెట్ చేసుకున్నాడు అని చెప్పాలి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus