Vaishnav Tej, Rashmi: యాంకర్ రష్మీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వైష్ణవ్ తేజ్!

  • September 8, 2022 / 01:17 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది మెగా హీరోలు చిరంజీవి అండతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇకపోతే మెగా స్టార్ చిరంజీవి అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి హిట్ అందుకున్నారు.

ఈ సినిమా అనంతరం ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈయన నటించిన తదుపరి చిత్రాలు రెండు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇలా వైష్ణవ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం రంగా రంగా వైభవంగా. గిరీషయ్యా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైష్ణవ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వైష్ణవ్ తేజ్ ను ప్రశ్నిస్తూ..

మీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలనుకుంటే ఏ హీరోయిన్ చేయాలని భావిస్తారంటూ ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ ఊహించని విధంగా యాంకర్ రష్మీ పేరు చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రష్మీ పేరు చెప్పడమే కాకుండా రష్మీలో హాట్ ఎక్స్ప్రెషన్ పలికించే తీరు తనకు ఎంతగానో నచ్చుతాయని ఈ సందర్భంగా యాంకర్ రష్మీ గురించి మెగా హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా వైష్ణవ్, రష్మీ గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు అదేంటి వైష్ణవ్ రష్మీ గురించి అలా మాట్లాడేసావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మీ గురించి ఇలాంటి భావనలో ఉన్నటువంటి ఈయన తన తదుపరి సినిమాలలో రష్మికి అవకాశం కల్పిస్తారా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus