Vaishnavi: అలాంటి రోల్స్ కు వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదా?
July 12, 2023 / 02:23 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు దక్కవని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ టాక్ నిజమేనని పలువురు తెలుగమ్మాయిలు సైతం చెబుతున్నారు. వైష్ణవి చైతన్య కూడా తెలుగమ్మాయి అనే సంగతి తెలిసిందే. బేబి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ అడిషన్స్ కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవని ఆమె తెలిపారు. బేబీ మూవీ తర్వాత వరుసగా మూవీ ఆఫర్లు వస్తాయని వైష్ణవి చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ కావాలనే వచ్చానని ఆమె కామెంట్లు చేశారు. (Vaishnavi) వైష్ణవి చైతన్య మాట్లాడుతూ బేబీ మూవీ కథ విని షాకయ్యానని డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ సినిమా కథను నమ్మారని వైష్ణవి చైతన్య వెల్లడించడం గమనార్హం. ఇన్ స్టా వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే హీరోయిన్ అవుతుందా అన్నారని వైష్ణవి అన్నారు. సాయి రాజేష్ గారు నాలో ధైర్యం నింపారని ఆమె తెలిపారు. సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ఆమె తెలిపారు.
బేబి కథ విన్న సమయంలో నా లైఫ్ గుర్తుకొచ్చిందని వైష్ణవి చైతన్య వెల్లడించారు. బేబి సినిమా ప్రీమియర్స్ ఈ నెల 13వ తేదీ రాత్రి నుంచి ప్రదర్శితం కానున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కలర్ ను ఒక మీటర్ లా తీసుకున్నామని వైష్ణవి చైతన్య వెల్లడించారు. డార్క్ లుక్ లో ఉన్న సీన్లు సినిమాలో ఎక్కువగా ఉన్నాయని వైష్ణవి చైతన్య తెలిపారు.
గ్లామర్ రోల్స్ కంటే పర్ఫామెన్స్ రోల్స్ కే ప్రాధాన్యత ఇస్తానని ఆమె అన్నారు. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటానని వైష్ణవి చైతన్య పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బేబీ మూవీ తర్వాతే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఆమె చెప్పుకొచ్చారు.