Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య తెలివి తేటలు మామూలుగా లేవుగా..!

  • July 13, 2023 / 09:21 PM IST

‘బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది అని కూడా చెప్పాలి. ఎస్.కె.ఎన్ ఈ చిత్రానికి నిర్మాత కాబట్టి.. అతనికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి అల్లు అరవింద్ ను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ కూడా అల్లు అరవింద్, బన్నీ వాస్..లకు అత్యంత సన్నిహితుడు. ఇక జూలై 14 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ లకి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇందులో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కి కూడా అప్పుడే ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టిక్ టాక్ వీడియోలతో, ఇన్స్టాలో రీల్స్ తో పాపులర్ అయిన ఈమె యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అటు తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది.

ఇప్పుడు హీరోయిన్ గా (Vaishnavi Chaitanya) మారింది కాబట్టి.. ఒకటి రెండు సినిమాలు చేసి సైడ్ అయిపోతుంది అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈమె తెలివితేటలు వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. నిన్నటి ఈవెంట్ లో ఈమె బడా నిర్మాత అల్లు అరవింద్ కి సరదాగా ప్రపోజ్ చేస్తున్నట్టు తెలిపి వార్తల్లో నిలిచింది.

ఈ క్రమంలో అల్లు అరవింద్ నువ్వు ఇంకా చిన్న పిల్లవి ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ గా ఎదుగుతావు అంటూ కామెంట్ చేశారు. అలాగే అల్లు అరవింద్ తన ‘జిఏ 2 ‘ పిక్చర్స్ లో నిర్మించే సినిమాల్లో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus