పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వకీల్ సాబ్ పట్టాలెక్కాడు!

  • September 22, 2020 / 12:36 PM IST

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతుండగా, ఫ్యాన్స్ వీలైనంత త్వరగా వకీల్ సాబ్ విడుదల కావాలని కోరుకుంటున్నారు. ఐతే వారి ముచ్చట మే నెలలోనే తీరాల్సి వుంది. అనుకోకుండా దాడి చేసిన కరోనా మహమ్మారి వలన పవన్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. చివరి దశలో మూవీ షూటింగ్ ఆగిపోవడంతో పాటు థియేటర్స్ మూతపడడంతో మూవీ విడుదల ఆగిపోయింది.

20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుండగా, నిర్మాతలు సైతం షూట్ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు . కాగా వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. చిత్రానికి సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టారట. పవన్ కళ్యాణ్ మాత్రం షూట్ లో పాల్గొనడం లేదని సమాచారం. పవన్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. దీక్ష ముగియడానికి మరికొంత సమయం ఉంది. దీక్షలో ఉన్న పవన్ జుట్టు, గడ్డం పెంచేశారు.

దీనితో వకీల్ సాబ్ లుక్ కోసం ఆయన మేకోవర్ కావల్సి వుంది. కావున వకీల్ సాబ్ షూటింగ్ లో పవన్ తరువాత పాల్గొననున్నాడని సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, నివేదా కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus