Vanitha Vijaykumar: పెళ్లి గురించి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?
January 31, 2024 / 11:08 AM IST
|Follow Us
తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా వివాదాస్పద విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీలలో వనితా విజయ్ కుమార్ ఒకరు. వనితా విజయ్ కుమార్ పేరు వింటే చాలామందికి ఆమె చేసిన కామెంట్లు గుర్తుకు వస్తాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచిన వనితా విజయ్ కుమార్ మళ్లీ పెళ్లి అనే సినిమాలో సైతం కీలక పాత్రలో నటించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.
తాను మూడో పెళ్లి చేసుకోలేదని పీటర్ పాల్ తో నిశ్చితార్థం మాత్రమే జరిగిందని ఆమె వెల్లడించారు. కొన్నిరోజులకు నా లైఫ్ నేను కోరుకున్నానని ఆయన వేరే రూట్ ను ఎంచుకోవడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏ రంగులో ఉండాలనే ప్రశ్నకు కుబేరుడిలా ఆకుపచ్చగా ఉండాలని వనితా విజయ్ కుమార్ కామెంట్లు చేశారు. ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో ఆమె ఇలా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
తనకు జరిగింది రెండు పెళ్లిళ్లు మాత్రమేనని మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్టు ప్రచారం చేయవద్దని ఆమె కోరుతున్నారు. తెలుగులో కూడా మంచి రోల్స్ వస్తే చేయడానికి వనితా విజయ్ కుమార్ సిద్ధంగానే ఉన్నారు. వనితా విజయ్ కుమార్ వయస్సు 43 సంవత్సరాలు కాగా ఆమె కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర షోలకు ఆమె ప్రాధాన్యత ఇచ్చారు.
ఆమెకు (Vanitha Vijaykumar) సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉండగా ఇతర యూట్యూబ్ ఛానల్స్ లో బిగ్ బాస్ రివ్యూవర్ గా ఆమె పని చేస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో ఆమె ఎక్కువగా డిమాండ్లు చేయడం లేదని తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉంటే ఆమెకు రాబోయే రోజుల్లో ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.