ఆన్ స్క్రీన్ ‘అన్న’.. ఆఫ్ స్క్రీన్ ‘డాడీ’!

  • October 20, 2022 / 06:54 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే చాలా మంది భయపడతారు. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదని కాస్త దూరంగా ఉంటారు. అందుకే ఆయనతో కలిసి నటించే తారలు, కలిసి పని చేసే సాంకేతిక నిపుణులు కూడా జంకుతుంటారు. కానీ బాలయ్యకు దగ్గరైన వాళ్ల మాటలు మాత్రం వేరేలా ఉంటాయి. ఆయన చిన్నపిల్లాడిలా ఉంటారని.. ఆయనతో బాండింగ్ ఏర్పడితే అంత ఈజీగా వదులుకోలేమని అంటుంటారు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ కి బాలయ్యతో మంచి బాండింగ్ ఏర్పడిందని సమాచారం.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తోంది. కథ ప్రకారం.. ఆమె బాలయ్యకు చెల్లెలుగా కనిపించనుంది. సినిమాలో వీరిద్దరి మధ్య సెంటిమెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. బాలయ్యతో కలిసి నటించడం వరలక్ష్మికి ఇదే తొలిసారి. అయితేనేం.. బాలయ్య కంపెనీను బాగా ఎంజాయ్ చేస్తోందట. కెమెరా ముందు ఆయన్ను ‘అన్నా’ అని పిలుస్తూ..

ఆఫ్ స్క్రీన్ మాత్రం ‘డాడీ’ అంటూ బాలయ్య వెంటే తిరుగుతుందట. బాలయ్య కూడా వరలక్ష్మిని కూతురిలా ట్రీట్ చేస్తున్నారట. షాట్ అయిపోగానే.. ఇద్దరూ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారట. అలానే కలిసి భోజనం కూడా చేస్తున్నారని సమాచారం. వీరిద్దరి బాండింగ్ చూసి సెట్ లో ఉన్నవారంతా ఆశ్చర్యపోతున్నారట. ఇప్పుడు వీరిద్దరి బంధం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

వరలక్ష్మి శరత్ కుమార్ ఇదివరకు తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఎప్పుడూ కూడా తన పని తను చేసుకొని పోవడమే తప్ప.. ఇలా సెట్ లో ఎవరితో కలిసి ఉండేది కాదట. కానీ బాలయ్యకి మాత్రం పైగా క్లోజ్ అయింది ఈ బ్యూటీ.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus