తన పెళ్ళి వార్తల పై వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందన..!
May 20, 2020 / 06:00 PM IST
|Follow Us
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ తన నటనతో ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తాను అని కాకుండా.. ఎటువంటి బోల్డ్ పాత్రని అయినా చెయ్యడానికి రెడీ అంటూ ఈమె దూసుకుపోతుంది. తమిళ్ తో పాటు కన్నడంలో కూడా వరుస సినిమాలు చేసింది. ఇక ‘పందెం కోడి2’ ‘సర్కార్’ ‘తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ముఖ్యంగా విశాల్ తో గతంలో ప్రేమాయణం నడిపింది అనే వార్తలతో బాగా ఇక్కడ బాగా పాపులర్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఈమె పెళ్ళి వార్తలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల ఓ క్రికెటర్ తో వరలక్ష్మీ డేటింగ్ లో ఉందని. అతను కోహ్లీ, ధోని లకు అత్యంత సన్నిహితుడని వార్తలు వచ్చాయి. వరలక్ష్మి కుటుంబ సభ్యులతో పాటు ఆ క్రికెటర్ కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్ళికి ఒప్పేసుకున్నారని.. అతి త్వరలో వీరిద్దరి పెళ్ళి ఉండబోతుంది అంటూ ప్రచారం నడుస్తుంది.అంతేకాదు పెళ్ళి తర్వాత సినిమాలకు వరలక్ష్మి గుడ్ బై చెప్పనుంది అనే ప్రచారం కూడా జరిగింది.
ఈ వార్తల పై తాజాగా వరలక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. ‘నాకు కనుక పెళ్ళి కుదిరితే ముందుగా మీద ఎక్కి గట్టిగా అరిచి.. నా పెళ్ళి విషయం అందరికీ చెబుతాను. ఇప్పుడైతే నేను పెళ్ళి చేసుకోవడం లేదు… అలాగే నేను సినిమాలు కూడా మానెయ్యడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. రవితేజ ‘క్రాక్’ సినిమాలో కూడా వరలక్ష్మి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.