Varasudu: ‘వారసుడు’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • January 15, 2023 / 12:20 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరిసు’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్.. వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ మూవీ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.

తెలుగు వెర్షన్ ‘వారసుడు’ పేరుతో జనవరి 14న రిలీజ్ కాబోతుంది. దీంతో తెలుగులో కూడా ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 5.50 cr
సీడెడ్ 2.00 cr
ఉత్తరాంధ్ర 2.10 cr
ఈస్ట్ 0.90 cr
వెస్ట్ 0.80 cr
గుంటూరు 1.05 cr
కృష్ణా 1.02 cr
నెల్లూరు 0.56 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.93 cr

‘వారసుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.13.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విజయ్ కు తెలుగులో మార్కెట్ ఉంది, వంశీ పైడిపల్లి తెలుగులో స్టార్ డైరెక్టర్, దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ .. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కనుక ఈ చిత్రాన్ని యాక్సెప్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. చూద్దాం..!

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus