Varsha, Emmanuel : మల్లెమాల-ఈటీవీ వారి పెళ్లిసందడి చూశారా!
June 29, 2021 / 05:51 PM IST
|Follow Us
పెట్టుడు మీసం, కట్టుడు పళ్లు గురించి విని ఉంటారు. టీవీ షోల కోసం ఇప్పుడు పెట్టుడు రిలేషన్లు, కట్టుడు బంధాలు మొదలయ్యాయి. మొన్నీ మధ్య వరకు సుధీర్, రష్మీ మధ్య ఇలాంటివే నడిపి టీఆర్పీలు, వ్యూస్ సంపాదించారు మల్లెమాల – ఈటీవీ బృందం. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ – వర్ష కాంబినేషన్ తెర మీదకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్లు… లవ్ సింబల్స్ గీసి మరీ జనాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరికీ టీవీ పెళ్లి ఏర్పాటు చేశారు.
ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే షో కోసం వర్ష, ఇమ్మాన్యుయల్ పెళ్లి చేసేశారు. ఈ వారం ఆ తంతు టీవీలో ప్రసారమవుతుంది. సాధారణంగా కామెడీ చేస్తే పండదా, ప్రేక్షకులు షోకి కనెక్ట్ అవ్వరా అనే అనుమానం ఈ మధ్య ఎక్కువవుతోంది. లేని బంధాన్ని, ఏదో ఉందని చూపించడం ఎందుకో జనాలకు అర్థం కావడం లేదు. పోనీలే ఏదో మన నవ్వు కోసం అనుకుందాం. ఆ లెక్కన వాళ్ల పెళ్లి తంతు చూడాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయండి.
వర్ష, ఇమ్మాన్యుల్ పెళ్లి మధ్యలో సుధీర్ ఆధ్వర్యంలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వచ్చి ఏం చేసిందనేది ఈ షోలో చూడొచ్చు. కరోనా నేపథ్యంలో పెళ్లికి హాజరయ్యే వారి సంఖ్య నేపథ్యంలో ఈసారి వినోదం రాసుకున్నట్లు ఉన్నారు. చూస్తుంటే నవ్వులు అయితే పూసినట్లుగా ఉన్నాయ్. అయితే అప్పుడు సుధీర్, రష్మి పెళ్లి షోలాగా ఇది ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.