తారక్ కి అభిమానినన్న బాలీవుడ్ హీరో!

  • July 10, 2018 / 06:41 AM IST

టాలీవుడ్ రేంజ్ పెరిగింది. తెలుగు హీరోల స్థాయి విస్తరించింది. అనేక భాషల్లో మన సినిమాలు అనువాదమై మంచి కలక్షన్స్ రాబడుతున్నాయి. అందులో నటించిన హీరోలకు గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు ఈగోలను పక్కన పెట్టి మన హీరోల నటనకు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ హీరోల సరసన నటించడానికి బాలీవుడ్ బ్యూటీలు ఇష్టపడుతున్నారు. అంతేకాదు అక్కడి హీరోలు మనవారి నటనను మెచ్చుకుంటున్నారు. ఇష్టమని మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, రానా.. లకు  మేము ఫ్యాన్స్ అని ఇదివరకు చాలామంది చెప్పారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని యువ హీరో వరుణ్ ధావన్ చెప్పారు.

అక్టోబర్, బద్లాపూర్ అనే చిత్రాలతో ఆకట్టుకున్న ఇతను  సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో ట్విట్టర్ వేదికపై ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. “సంజు” సినిమా గురించి స్పందిస్తూ.. “సంజూ” సినిమా చాలా బాగుంది. సినిమాలోని ప్రతీ అంశం చాలా న‌చ్చింది. ర‌ణ్‌బీర్ ప్ర‌ద‌ర్శ‌న అత్య‌ద్భుతం” అని అభినందించారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి చెప్పమంటే… “ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయ‌న‌కు వీరాభిమానిని” అని అన్నారు. వరుసగా నాలుగు విజయాలు అందుకున్న తారక్.. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus