వైరల్ అవుతున్న వరుణ్ ధావన్ కాళ్ళు పట్టుకున్న నోరా వీడియో

  • March 6, 2019 / 06:09 PM IST

పాపం ఆ ఐటెమ్ గర్ల్ ఆ బాలీవుడ్ హీరో కాళ్ళు పట్టుకోవడం అనేది జరిగింది సరదాకే అయినప్పటికీ.. ఆ విషయం మాత్రం చాలా వైరల్ అయ్యింది. ప్రస్తుతం “ఎబిసిడి 2” కోసం ప్రిపేర్ అవుతున్న వరుణ్ ధావన్ కి మన టాలీవుడ్ మూవీస్ లో ఐటెమ్ సాంగ్స్ లో మెరిసిన నోరా ఫతేహీ డ్యాన్స్ లో ట్రయినింగ్ ఇస్తోంది. ఒక సెషన్ అనంతరం క్లాస్ నుంచి వెళ్లిపోతున్న వరుణ్ ధావన్ కాళ్ళను నోరా పట్టుకోగా.. అతడు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ వీడియోను వరుణ్ ధావన్ తోపాటు నోరా కూడా తన ఇస్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకొంది.

దాంతో ఆ స్టోరీని చూసినవాళ్లందరూ ఇదేంటి అమ్మడు ఇలా కాళ్ళు పట్టేసుకుంది అని డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ ఫన్నీ డిస్కషన్ కి బాలీవుడ్ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు. దాంతో ఈ రచ్చ ఇంకాస్త పెరిగింది. నోరా తెలుగులో ఎన్టీఆర్ “టెంపర్”, వరుణ్ తేజ్ “లోఫర్”, నాగార్జున “ఊపిరి”, ప్రభాస్ “బాహుబలి” సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus