Varun Dhawan: తన హెల్త్ స్టేటస్ పై స్పందించిన వరుణ్ ధావన్!
November 8, 2022 / 05:56 PM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసుకున్న ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్.. తనకు వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ ఉందని వెల్లడించారు. నిజానికి వరుణ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాంటిది ఆయనకు వ్యాధి ఏంటని ఆందోళన చెందారు అభిమానులు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే మనిషి చెవిలోని అంతర్గత భాగం సరిగ్గా పనిచేయనప్పుడు లేదా పనిచేయడం పూర్తిగా ఆగిపోయినప్పుడు ఈ పరిస్థితి కలుగుతుంది.
దీనివలన కళ్లు తిరగడం, వికారం వంటివి కలుగుతాయి. వరుణ్ ధావన్ హెల్త్ విషయంలో అభిమానులు టెన్షన్ పడడంతో వెంటనే ఆయన సోషల్ మీడియా వేదికగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం వంద శాతం బాలేదని చెప్పానని.. ఆ తరువాత అభిమానులంతా తనపై చూపించిన ప్రేమ, పడ్డ ఆందోళన తన హృదయానికి తాకిందని అన్నారు. మళ్లీ తను పూర్తిగా కోలుకోవడానికి అవసరమైన శక్తిని ఇచ్చారంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి తను ఆరోగ్యంగానే ఉన్నట్లు..
ఎవరినీ ఆందోళన చెందొద్దని రాసుకొచ్చారు. యోగ, స్విమ్మింగ్, ఫిజియో థెరపీ వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు తన హెల్త్ బాగుందని.. లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వలన బెటర్ అవుతున్నానని.. అన్నింటికంటే దేవుడి ఆశీర్వాదం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ హీరో నటించిన ‘బేడియా’ అనే సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.