Varun Tej: టికెట్ రేటు భారం కాకూడదు.. అందుకే ఈ నిర్ణయం: వరుణ్ తేజ్
May 27, 2022 / 08:24 PM IST
|Follow Us
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ నటించిన చిత్రం ఎఫ్ 3.కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా నేడు విడుదల కావడంతో పెద్ద ఎత్తున చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా టిక్కెట్ల రేట్లు గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా ఇప్పటికే విడుదలైన కొన్ని సినిమాలు టికెట్ల రేట్లను పెంచిన సంగతి మనకు తెలిసిందే.అయితే దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా టికెట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లను అందుబాటులో ఉంచారు. ఇలా సినిమా టిక్కెట్ల రేట్లను పెంచకపోవడం వల్ల సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుందా అని వరుణ్ తేజ్ ను ప్రశ్నించగా ఆయన ఆశక్తికరమైన సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ఎఫ్ 3 సినిమా కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా. అలాంటి సినిమాకు టికెట్ రేట్లను పెంచడం వల్ల ఒక సామాన్య వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే ఎంతో భారమవుతుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత దిల్ రాజు సినిమా టికెట్ల రేట్లను పెంచకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడాలన్న ఉద్దేశంతోనే సినిమా టికెట్ల రేట్లను తగ్గించామని,ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్ లో చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తారని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.