Gaandeevadhari Arjuna Twitter Review: గాండీవదారి అర్జున ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • August 25, 2023 / 11:09 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మొదటి నుండి ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు.

కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది (Gaandeevadhari Arjuna) ఈ చిత్రం. ఇక ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అనే విధంగా ఉందట.చాలా ఫ్లాట్ గా సాగుతుందని.. పెద్దగా ఎక్సయిట్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు అని అంతా అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం కొంచెం పర్వాలేదు అని చెబుతున్నారు.

ఇక సెకండ్ హాఫ్ లో స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా.క్లిచ్డ్ సీన్స్ వల్ల అలాగే.. కొన్ని చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ కూడా శృతి మించడం వల్ల.. పెద్దగా ఆసక్తిగా సాగదు అని అంటున్నారు. మొత్తంగా ఇది ఒక బోరింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus