పుట్టినప్పటి నుంచి పెద్దవారు అయ్యేవరకు వరకు మనకి ఎంతోమంది పరిచయమవుతారు. వారిలో కొంతమంది ప్రత్యేకంగా గుర్తుంటారు. అతి తక్కువమంది మనసుకు దగ్గరవుతారు. హృదయంలో నిలిచిపోతారు. ఎంతలా అంటే ఆ వ్యక్తి ఈ లోకం నుంచి దూరమైనా కళ్ళముందే కనబడే అంత. అనుక్షణం గుర్తొచ్చే అంత. అలా ఓ ప్రేమికుడికి ప్రేమికురాలు ఇచ్చిన జ్ఞాపకాల పుస్తకమే ఈ “వసంత కోకిల”.
ఈ పుస్తకంలో ప్రతి పేజీ మధురంగా ఉంటుంది. రావుగారు కాసిరెల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ కి యువత ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఇందులోని “ఏదో మాయే చేసేసినావె .. ఎదలోన చోటే ఇచ్చావే” అనే పాట ఇప్పటికే ఎంతోమంది మొబైల్స్ కి రింగ్ టోన్ గా మారిపోతోంది. మీరు విన్నారంటే ఈ సాంగ్ కి, షార్ట్ ఫిలిం కి ఎదలోనా చోటిస్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.