Vedaa Review in Telugu: వేదా సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 16, 2024 / 04:46 PM IST

Cast & Crew

  • జాన్ అబ్రహాం (Hero)
  • శర్వారి (Heroine)
  • అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్ధి, తమన్నా తదితరులు.. (Cast)
  • నిఖిల్ అద్వానీ (Director)
  • ఊమేష్ భన్సాల్ - మోనిషా అద్వానీ - మధు భోజ్వాని - జాన్ అబ్రహాం (Producer)
  • కార్తీక్ షా (Music)
  • మలయ్ ప్రకాష్ (Cinematography)

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం (John Abraham) నటించిన తాజా చిత్రం “వేదా” (Vedaa) . శర్వారి (Sharvari Wagh) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia) అతిధి పాత్రలో నటించగా.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించడం కోసం ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన జాన్ అబ్రహాం అనువదించి మరీ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు. మరి జాన్ అబ్రహాం ప్రయత్నం ఏమేరకు ఫలించిందో చూద్దాం..!!

Vedaa Review

కథ: తన భార్య రాశి (తమన్నా) హత్యకు ప్రతీకారంగా మిలటరీ సోల్జర్ అయ్యుండి రూల్స్ అతిక్రమించి టెర్రరిస్ట్ ను హతమార్చిన కారణంగా కోర్ట్ మార్షల్ చేయబడి విధుల నుండి తీసేయబడిన మేజర్ అభిమన్యు (జాన్ అబ్రహాం), లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడం కోసం రాజస్థాన్ లోని బార్మర్ గ్రామానికి వస్తాడు. అక్కడ జితేందర్ ప్రతాప్ సింగ్ (అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) దళితులను అత్యంత నీచంగా చూసే విధానం నచ్చక, ఆ దళారి వ్యవస్థ నుండి విముక్తి పొందడం కోసం ప్రయత్నిస్తున్న వేదా (శర్వారి)కి బాక్సింగ్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెడతాడు.

కట్ చేస్తే.. వేదా అన్నయ్య ఓ అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో అందరి జీవితాలు ఒక్కసారిగా చిధ్రమవుతాయి. వేదాకు వెన్నుదన్నుగా నిలిచి అభిమన్యు ఈ కులాహంకార వ్యవస్థపై ఎలా పోరాడాడు? అనేది “వేదా” (Vedaa) సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తంలో నటనతో విశేషంగా ఆకట్టుకుంది నెగిటివ్ రోల్ ప్లే చేసిన అభిషేక్ బెనర్జీ. కళ్ళల్లో అహంకారం, ముఖంలో మంచితనం నటించే సర్పంచ్ పాత్రలో ఒదిగిపోయాడు. శర్వారి కూడా ఓ మేరకు తనదైన శైలి నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయితే.. ఆమె పాత్రకు సరైన క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడంతో, అందరూ కనెక్ట్ అవ్వాల్సిన ఆమె క్యారెక్టర్ అలా మిగిలిపోయింది.

జాన్ అబ్రహాం ఎప్పట్లానే ఫైట్ సీన్స్ వరకూ మెప్పించాడు కానీ, ఎమోషనల్ సీన్స్ లో మాత్రం దారుణంగా తేలిపోయాడు. ఒక్కోసారి అతడి ముఖంలో ఎక్స్ ప్రెషన్ కి అర్ధం తెలియక ప్రేక్షకులు కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు.

సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ షా నేపధ్య సంగీతం ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన టెక్నికల్ అంశం. సన్నివేశంలోని ఇంటెన్సిటీని, పాత్రలోని బాధను సితార్ తో అద్భుతంగా ఎలివేట్ చేశాడు. సినిమా మొత్తానికి పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక్ షా నేపథ్య సంగీతం మాత్రమే. యాక్షన్స్ సీన్స్ కంపోజిషన్ మాస్ ఆడియన్స్ ను ఓ మేరకు అలరిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా.. చాలా లావిష్ గా తెరకెక్కించారు.

సీనియర్ దర్శకుడు నిఖిల్ అద్వానీ (Nikkhil Advani) .. ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని దానికి కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కిద్దామనుకున్న ఆలోచన బాగున్నప్పటికీ.. దాని ఆచరణ రూపం మాత్రం బెడిసికొట్టింది. ముఖ్యంగా.. జాన్ అబ్రహాం క్యారెక్టర్ ఆర్క్ అండ్ శర్వారీ క్యారెక్టర్ ఆర్క్స్ కి ఎక్కడా గ్రోత్ స్కోప్ లేకుండా రాసుకున్న సన్నివేశాల వల్ల, సినిమాలో పస లేకుండాపోయింది. జాన్ అబ్రహాం అనేసరికి ఆడియన్స్ ఒక రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్ పెక్ట్ చేసి వస్తారు, ఓ రెండు బ్లాక్స్ మినహా పెద్దగా ఎగ్జైట్ చేసే యాక్షన్ లేకపోవడం మైనస్.

అలాగే.. ఎంతో కీలకమైన కోర్ట్ లో క్లైమాక్స్ బ్లాక్ ను చాలా పేలవంగా చుట్టేసిన విధానం సినిమాకి కానీ, క్యారెక్టర్స్ కి కానీ సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. చివర్లో ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పడంతో ఇంకాస్త నిరాశ కలుగుతుంది.

విశ్లేషణ: ఒక అమ్మాయికి, అందులోనూ దళితురాలికి సహాయంగా ఒక ఆర్మీ మేజర్ నిలవడం అనే పాయింట్ తో అద్భుతమైన కమర్షియల్ సినిమా తీయొచ్చు. కానీ.. దర్శకుడు ఎమోషనల్ గా “ఆర్టికల్ 15” తరహాలో ఆలోజింపజేసేలా తెరకెక్కించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అందులోనూ ఎమోషనల్ కనెక్టివిటీ అస్సలు లేకపోవడం మెయిన్ మైనస్ గా మారింది. ఓవరాల్ గా కమర్షియల్ హిట్ కొట్టాలన్న జాన్ అబ్రహం ఆశకు నిరాశే ఎదురైంది.

ఫోకస్ పాయింట్: ఇంకోసారి వాయిదా పడుంటే బాగుండు వేదా!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus