Venkatesh: ‘సైంధవ్‌’ రిలీజ్‌ డేట్‌… తర్వాతి ప్రాజెక్ట్‌… ఆన్సర్‌ ఏంటి?

  • October 9, 2023 / 04:35 PM IST

మైల్‌ స్టోన్‌ సినిమాఉల హీరోలకు ఎంత ప్రతిష్ఠాత్మకమో ఫ్యాన్స్‌కి కూడా అంతే స్పెషల్‌. అందుకే మైల్‌ స్టోన్‌ మూవీస్‌ కౌంట్‌ వేస్తూనే ఉంటారు. అలా ప్రస్తుతం వెంకటేశ్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ప్రస్తుతం వెంకీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వెంకీ కెరీర్‌లో 75వ సినిమా అనే విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి, అలాగే ఆ తర్వాతి సినిమా గురించి పెద్ద ఎత్తున అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

అదేంటి.. వెంకటేశ్‌ 75వ సినిమా ‘సైంధవ్‌’ రిలీజ్‌ డేట్‌ ఇప్పటికే ఇచ్చేశారు కదా అనుకుంటున్నారా? అవును మీరు అన్నది కరెక్టే. అయితే ‘సలార్‌’ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ తర్వాత పరిస్థితి మారిపోయిందిగా. ‘డైనోసార్‌’కు సింగిల్‌ ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అప్పటికే డిసెంబరు 22 కోసం ఆగి ఉన్న సినిమాలు వేరే డేట్‌ను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో ‘సైంధవ్‌’ను కాస్త ముందు కానీ, సంక్రాంతికి కానీ తీసుకొచ్చే పనిలో ఉన్నారని టాక్‌.

ఈ విషయం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే వెంకీ 76వ సినిమా ఏంటి? అంటూ మరో చర్చ మొదలైంది. కారణం ఇటీవల వెంకటేశ్‌ కొన్ని కథలు విన్నారు అనే టాక్‌ బయటకు రావడమే. ఈమధ్య కాలంలో సీనియర్‌ స్టార్‌ హీరోలు, యువ దర్శకుల కాంబినేషన్లు ఎక్కువయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ప్రస్తుతం యువ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. అలా వెంకీ (Venkatesh) కూడా ‘సైంధవ్‌’తో శైలేష్‌ కొలను సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కూడా ఆయన ఇదే ఆలోచనలో ఉన్నారట. సిద్ధు జొన్నలగ్డతో ‘డీజే టిల్లు’ తీసిన దర్శకుడు విమల్‌కృష్ణ ఇటీవల వెంకటేశ్‌కి కథ వినిపించారట. సినిమా కాన్సెప్ట్‌ విషయంలో వెంకీ ఆసక్తిగా ఉన్నారు అని టాక్‌ వినిపిస్తోంది. అన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్‌ మూవీ ఇదే అని అంటున్నారు. డిసెంబరులో వెంకీ పుట్టిన రోజు ఉన్న సందర్భంగా మరిన్ని వివరాలు ఆ రోజు తెలుస్తాయని చెబుతున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus