శోభన్ బాబు హీరోగా వెంకటేష్ నిర్మించిన సినిమా ఏదో తెలుసా!..
February 15, 2023 / 06:34 PM IST
|Follow Us
మూవీ మొఘల్, వివిధ భాషల్లో సినిమాలు నిర్మించిన గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన లెజెండరీ ప్రొడ్యూసర్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, రామా నాయుడు స్టూడియో వ్యవ స్థాపకులు డా. డి. రామా నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. పెద్ద కొడుకు సురేష్ బాబు తండ్రి లానే స్టార్ ప్రొడ్యూసర్ కాగా.. రెండో కొడుకు వెంకటేష్ స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు.. ఓ నిర్మాత కొడుకు హీరోగా మారడం అనేది అప్పట్లో సంచలనం..
రామా నాయుడు తను నిర్మించే సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసేవారు.. సురేష్ బాబు నిర్మాతగా తమ్ముడు వెంకీతో పాటు పలు సినిమాలు నిర్మించారు కానీ విక్టరీ వెంకటేష్ నిర్మాతగా ఓ సినిమా నిర్మించారనే సంగతి చాలా మందికి తెలియదు.. వెంకీకి ‘నటభూషణ’ శోభన్ బాబు గారంటే చాలా ఇష్టం. ఆయనతో తానే నిర్మాతగా ఒక మూవీ చేశారు.. వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త బ్యానర్ పెట్టి, తనే నిర్మాతగా ‘‘ఎంకి – నాయుడు బావ’’ అనే మూవీ నిర్మించారు..
అప్పుడు వెంకటేష్ వయసు 18 ఏళ్ళు మాత్రమే.. ఆ సినిమా ఓపెనింగ్ అప్పటి ఫోటోనే ఇది..రామా నాయుడు సమర్పణలో వచ్చిన ఈ ఫిలిం సినిమా స్కోప్ – ఈస్ట్మన్ కలర్లో రూపొందించారు.. వాణిశ్రీ కథానాయిక.. గుమ్మడి, కాంతారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి తారాగణం నటించగా.. కె.వి. మహదేవన్ సంగీతమందించారు.. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు.. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పలు చిత్రాలు డైరెక్ట్ చేశారయన..
ఇక నిర్మాతగా డి. వెంకటేష్ బాబు అని వెంకీ పేరు పడుతుంది.. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లడం.. నటనలో శిక్షణ తీసుకుని.. ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా పరిచయమై.. తెలుగులో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా సెటిలైపోయారు విక్టరీ వెంకటేష్.. తన అభిమాన నటుడితో నిర్మాతగా చేసిన ఈ ఫిలిం వెంకీకి ఎంతో ప్రత్యేకమైనది..