Indian2: ‘ఇండియన్2’ లో కమల్ తో ఫైట్ చేయనున్న వెన్నెల కిషోర్..!

  • March 1, 2023 / 11:05 AM IST

‘వెన్నెల’ చిత్రంతో నటుడిగా మారి తన నటనతో కడుపుబ్బా నవ్వించి.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు కిషోర్.. అలియాస్ ‘వెన్నెల’ కిషోర్. టాలీవుడ్లో ఇప్పుడు ఇతనో బిజీ కమెడియన్. అలా అని కేవలం కమెడియన్ పాత్రలే చేస్తుండడం కాకుండా.. హీరోలతో సమానమైన పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో శర్వానంద్ తో సరిసమానమైన పాత్రను పోషించి.. ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చాలా సినిమాల్లో ఇతనికి ఫుల్ లెంగ్త్ రోల్స్ పడుతున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ వంటి పాన్ ఇండియా సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వెన్నెల కిషోర్ కి.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ లభించింది. హెడ్డింగ్ చూసి అది ఏ సినిమానో ఈ పాటికి మీరు కనిపెట్టేస్తారు అనుకోండి..అయితే అది నిజమా అనే డౌట్ మీకు ఏర్పడవచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం అయితే అది నిజమే.

కమల్ హాసన్.. శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఇండియన్2’ లో వెన్నెల కిషోర్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే మెయిన్ విలన్ గా చేస్తున్నాడా… లేక పార్ట్ టైం విలన్ గా కనిపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.లైకా వారు నిర్మిస్తున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవానీ శంకర్ వంటి భామలు నటిస్తున్నారు.

అలాగే కీలక పాత్రల్లో బాబీ సింహా, సముద్రఖని కూడా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కనుక వెన్నెల కిషోర్ పాత్ర క్లిక్ అయితే అతను పాన్ ఇండియా లెవెల్లో బిజీ ఆర్టిస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus