Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..!

  • August 19, 2023 / 03:26 PM IST

నందమూరి అభిమానులంతా వారసుడి ఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడంటూ ఇప్పటికే పదుల సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాలుగా ఫలానా డైరెక్టర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్కటి పట్టాలెక్క లేదు. అయితే ఇటీవల సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి నందమూరి మోక్షజ్ఞ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తదుపరి తరం హీరోగా బాలయ్య సినిమాల్లోకి వచ్చి అగ్ర కథనాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలయ్య తర్వాత ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ ను టాలీవుడ్కి పరిచయం చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య తన ఆదిత్య 369 సీక్వెల్ తో తన డైరెక్షన్లోనే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నానని చెప్పారు.

అఖండ సినిమా సమయంలో వేణు స్వామి బాలయ్య కుటుంబాన్ని కలిశారు. బాలయ్యతో పాటు అక్కడ మోక్షజ్ఞను కూడా కలిసినట్లు తెలిపారు వేణు స్వామి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మోక్షజ్ఞ జాతకం చూశారా అని వేణుస్వామిని అడగారు. ఈ క్రమంలోనే వేణుస్వామి మాట్లాడుతూ.. చూశాను మోక్షజ్ఞ జీవితం చాలా బాగుంటుంది.

ఆయన సినీ కెరియర్ బాగుంటుంది. కానీ సినిమాల్లోకి ఆయన ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు. దాదాపుగా రెండు మూడేళ్లు పడుతుందంటూ బాంబు పేల్చారు. ఇప్పటికే లేట్ అవుతుంది కానీ ఇంకా రెండు మూడేళ్లంటే ఎలా బాలయ్య అని ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. (Mokshagna) మోక్షజ్ఞ సినిమా కెరీర్ బాగానే ఉన్న రాజకీయాల జోలికిపోరంటూ తెలియజేశారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus