Venu Swamy: ప్రభాస్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన వేణు స్వామి.. వీడియో వైరల్!

  • December 28, 2023 / 11:22 AM IST

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితమే. రెండేళ్లుగా ఇతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈయన గురించి ఎక్కువగా న్యూస్..లు వస్తుండటం, అవి వైరల్ అవుతుండటం జరుగుతుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్.. ఇతన్ని సంప్రదించి లక్షలు పోసి ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాయి. వ్యూస్ కోసం వాళ్ళు పెద్ద సెలబ్రిటీల కోసం ఇతన్ని ప్రశ్నలు అడగడం.. వాటికి ఇతను చెప్పే సమాధానాలను బైట్స్ గా కట్ చేసుకుని వైరల్ చేయించుకోవడం వంటివి కూడా అందరం చూస్తూనే ఉన్నాం.

సరే ఈ వేణు స్వామి ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కోటి చెబుతూ ఉంటారు అని అంతా అంటూ ఉంటారు. కానీ ఈయన చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి అని కూడా కొందరు ఆ వీడియో బైట్స్ ను వైరల్ చేస్తూ ఉండటం కూడా కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ మధ్య ఇతని జ్యోతిష్యాన్ని కొందరు తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణా ఎన్నికల విషయంలో వేణు స్వామి… రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం లేదు అని మళ్ళీ టి.ఆర్.ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని..

ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి చెప్పినట్టు కొందరు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా షేర్ చేశారు. కానీ ఆయన చెప్పినట్టు జరగలేదు అని వాదించేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అది సెన్సిటివ్ మేటర్ కాబట్టి.. మనం మెయిన్ టాపిక్ కి వచ్చేద్దాం. అది పక్కన పెట్టేస్తే.. వేణు స్వామి.. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకం చెబుతూ.. ‘అతని హైట్స్ అయిపోయాయి అని, ప్రభాస్ కి ఇక హిట్లు రావు అని, ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు కూడా తమ జాతకాలు చూపించుకోవాలని’ ఇతను జోస్యం చెప్పాడు.

కానీ ఇప్పుడు ‘సలార్’ పెద్ద హిట్ అయ్యింది. దీంతో (Venu Swamy) వేణు స్వామిని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ క్రమంలో వేణు స్వామి అహం దెబ్బతిన్నట్టు ఉంది. కాబట్టి లేటెస్ట్ ఇంటర్వ్యూల్లో ‘బాలీవుడ్ జనాలు టాలీవుడ్ ను దూరం పెట్టే అవకాశం ఉందని, కొందరు హీరోల అభిమానుల వల్ల బాలీవుడ్ స్టార్స్ అహం దెబ్బతింటుంది’ అంటూ వేణు స్వామి ప్రభాస్ ఫ్యాన్స్ కి చురకలు అంటించాడు.

‘డంకీ’ సినిమా కలెక్షన్స్ పై ‘సలార్’ కలెక్షన్స్ పైచేయి సాధించడంతో ప్రభాస్ ఫ్యాన్స్.. షారుఖ్ ఫ్యాన్స్ ను ట్రోల్ చేశారు. దానికి ముందు షారుఖ్ సినిమా యూనిట్ ‘సలార్’ కి నార్త్ లో ఎక్కువ థియేటర్స్ ఇవ్వకుండా చేసిన కుట్రల నేపథ్యంలో వారు షారుఖ్ అభిమానులను టార్గెట్ చేశారు. వీటిని అడ్డం పెట్టుకుని వేణు స్వామి ప్రభాస్ అభిమానులను టార్గెట్ చేయడం జరిగింది లేటెస్ట్ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus