Vidyullekha Raman: ‘విడాకులకు వస్త్రధారణే కారణమా..?’ నటి ఫైర్!
October 5, 2021 / 02:26 PM IST
|Follow Us
తెలుగు, తమిళ భాషల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్. ఆమె కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. గతేడాది తన స్నేహితుడు సంజయ్ తో నిశ్చితార్ధం జరగ్గా.. కొన్ని రోజుల క్రితం వివాహం కూడా చేసుకున్నారు. కరోనా కారణంగా బంధువులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తోన్న విద్యుల్లేఖ బీచ్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
స్విమ్ సూట్ లో ఉన్న ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఐటీని ఈ డ్రెస్సింగ్ స్టైల్ ను విమర్శిస్తూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా.. ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు..?’ అని ప్రశ్నించాడు. దీంతో విద్యుల్లేఖ ఫైర్ అయింది. ‘నేను స్విమ్ సూట్ వేసుకున్నందుకే ఇలా అడుగుతుహున్నారా..? ఆంటీ, అంకుల్స్ 1920ల కాలం నుంచి 2021కి రండి’ అని వెటకారంగా కామెంట్ చేసింది విద్యుల్లేఖ.
ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే.. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ వారి వైవాహిక జీవితాల్లో ఆనందంగా ఉన్నారా..? అని ప్రశ్నించింది. జీవితానికి భద్రత, భరోసానిచ్చే, నీతి, నిజాయితీ గల భర్తను పొందిన నేను అదృష్టవంతురాలిని అని చెప్పింది. ఇలాంటి కామెంట్స్ పై స్పందించడం కంటే వదిలేయమని తన భర్త చెప్పినా.. అలా ఉండలేకపోయానని తెలిపింది. విమర్శకులారా.. మీ విషపూరిత ఆలోచనలను నేను మార్చలేను.. మీ జీవితంలో మహిళ అంటే కామవాంఛ తీర్చే సాధనంగా చూస్తున్నప్పుడు ఆమెలోని వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుందని ఘాటుగా సమాధానమిచ్చింది.