Vijay Antony: చిన్న కూతురితో ప్రమోషన్లలో పాల్గొంటున్న విజయ్ ఆంటోని!
September 29, 2023 / 05:50 PM IST
|Follow Us
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా 16 ఏళ్ళ వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో విజయ్ ఆంటోనీ ఎంతగానో కృంగిపోయాడు. అది చిన్న విషయం కాదు. ఇలాంటి టైంలో అతను బయటకు రావడం కూడా చాలా కష్టం. ఇలాంటి టైంలో అతను సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఏడుస్తూనే ఉంటున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇలాంటి టైంలో తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్ కోసం ఆయన మీడియా ముందుకు వచ్చాడు. విజయ్ ఆంటోనీ హీరోగా ‘రత్తం’ అనే సినిమా రూపొందింది. సీఎస్ అముదన్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 6 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విజయ్ పరిస్థితిని చూసి ఈ సినిమాని వాయిదా వేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. అంతకు ముందు కూడా ఈ సినిమా రిలీజ్ అనేది చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
దీంతో మేకర్స్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. అలాగే రిలీజ్ ను పోస్ట్ పోన్ కాకూడదు అనే ఉద్దేశంతో స్వయంగా విజయ్ ఆంటోనీ ప్రమోషన్ కి హాజరైనట్టు తెలుస్తుంది. ఈ విషయంలో విజయ్ ఆంటోనీని తప్పకుండా మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది హీరోలు.. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. ప్రమోషన్ కి ఏదో ఒక రకంగా ఎగ్గొట్టాలి అని చూస్తుంటారు.
కానీ ఇంతటి బాధాకరమైన పరిస్థితుల్లో కూడా విజయ్ ఆంటోనీ తన సినిమాను ప్రమోట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం తన (Vijay Antony) చిన్న కూతురు లారాని కూడా తీసుకొచ్చారు.