Vijay Antony: ఆ స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలని ఉంది: విజయ్ ఆంటోనీ
May 4, 2023 / 08:11 PM IST
|Follow Us
సాధారణంగా ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటులు గాయపడుతుంటారు. హీరో విక్రమ్ షూటింగ్ సమయంలో గాయపడి పక్కడెములు విరిగాయి. అదే తరహాలో హీరో విజయ్ ఆంటోని హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ.. గాయపడ్డాడు. అసలు ఏమి జరిగిందో చూద్దాం.. సినిమా షూటింగ్ సందర్భంగా సముద్రంలో పడిపోయిన తనను హీరోయిన్ కావ్య థాపర్, కెమెరామెన్ అసిస్టెంట్స్ రక్షించారని హీరో విజయ్ ఆంటోని చెప్పారు. భవిష్యత్‌లో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన తెలిపారు.
విజయ్ ఆంటోని – కావ్య థాపర్ జంటగా నటించిన చిత్రం ‘పిచ్చైకారన్-2’ ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది. రాధారవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీశ్ పెరాడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు నటించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానరుపై నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్‌ను గత నెలలో విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం తాజాగా చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో హీరో (Vijay Antony) విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటులు గాయపడుతుంటారు. కానీ, నేను హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశ చిత్రీకరణ సమయంలో గాయపడ్డాను. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సముద్రంలో పడిపోయిన నన్ను హీరోయిన్, కెమెరామెన్ అసిస్టెంట్స్ రక్షించారు. ఈ చిత్రం ‘పిచ్చైకారన్’ కథకు సీక్వెల్ కాదు. ఇది వేరే స్టోరీ. ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. ఈ చిత్రానికి యాదృచ్ఛికంగా దర్శకత్వం వహించాను.
ప్రమాదం తర్వాత ఎంతో యాక్టివ్‌గా ఉన్నాను. ముఖంపై చిన్న మచ్చలు మినహా ఆరోగ్యపరంగా బాగున్నాను. నా చిత్రాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి కారణం ఉంది. నా కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని ప్రతిభావంతులైన కొత్తవారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రానికి సంగీతం కూడా విజయ్ ఆంటోనీనే అందించారు