Beast Movie: ‘బీస్ట్’ కు షాకిచ్చిన కువైట్ ప్రభుత్వం.. విడుదలకు నిషేధం..!

  • April 5, 2022 / 07:27 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. ‘డాక్టర్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధిమారన్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవల విడుదలైన ‘బీస్ట్’ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఏప్రిల్ 13న ‘బీస్ట్’ తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

అయితే విజయ్ సినిమాలకు భారీ కలెక్షన్లు నమోదయ్యే ఏరియాల్లో కువైట్ కూడా ఒకటి. అయితే ‘బీస్ట్’ చిత్రం విడుదలకు అక్కడి ప్ర‌భుత్వం బ్రేకులు వేసింది. కువైట్‌లో ‘బీస్ట్’ను విడుదల చేయకూడదంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కువైట్‌లో శిక్ష‌లు వంటివి చాలా క‌ఠినంగా అమలు చేస్తారు. ముఖ్యంగా సినిమా సెన్సార్ విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే కువైట్ ప్రభుత్వం ‘బీస్ట్’ విడుదలకు అడ్డంకులు వేయడానికి కారణం లేకపోలేదు.

‘బీస్ట్’ సినిమాలో టెర్రరిస్టులు ఓ మాల్‌ను హైజాక్ చేయ‌డం.. అదే మాల్‌ ఉన్న హీరో వారినెలా అంతం చేశాడ‌నే పాయింట్‌ తో తెరకెక్కినట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. ‘బీస్ట్’ ట్రైలర్లో టెర్ర‌రిస్టులు, హైజాక్ వంటివి కనిపిస్తూ ఉండడంతో కువైట్ ప్ర‌భుత్వం ‘బీస్ట్’ విడుదలకు అడ్డుకట్ట వేసినట్టు స్పష్టమవుతుంది. గతంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా రూపొందిన ‘కురుప్‌’, విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఎఫ్ఐఆర్’ వంటి చిత్రాల‌ను కూడా కువైట్ ప్ర‌భుత్వం నిషేధించింది.

చిత్ర బృందం భారీగా ప్రయత్నిస్తే తప్ప అక్కడ విడుదల అసాధ్యమనే చెప్పాలి. మొత్తంగా విజయ్ ‘బీస్ట్’ కలెక్షన్ల పై ఇది భారీగా ప్రభావం చూసే అవకాశం ఉంది. ఇక అనిరుథ్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. ‘అరబిక్ కుత్తు’ అనే పాట ఇప్పటికే ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus