Beast Story: విజయ్‌ ‘బీస్ట్‌’ కథ ఇదేనంటూ పోస్ట్‌ వైరల్‌

  • April 5, 2022 / 04:31 PM IST

పాన్‌ ఇండియా సినిమాగా విజయ్‌ ‘బీస్ట్‌’ను తీర్చిదిద్దుతున్నాం… మొన్నీ మధ్య వరకు ఆ సినిమాకు ఈ విషయం ఒక్కటే తెలుసు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్‌ సరసన పూజ హెగ్డే నటిస్తోందని, అనిరుథ్‌ సంగీతమందిస్తున్నాడని కూడా తెలుసనుకోండి. అయితే సినిమా ట్రైలర్‌ వచ్చాక చాలావరకు సినిమా కథ తెలిసిపోతుంది. దీంతో కొంతమందేమో కథ ఇదేనా అంటూ పెదవి విరుస్తుంటే, ఇంకొందరేమో సూపర్‌ ప్లాట్‌ అంటూ మురిసిపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో పూర్తి కథ ఇదే అంటూ ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా ట్రైలర్‌ చూసే ఉంటారు (ఈ రోజు తెలుగు ట్రైలర్ వస్తుంది కాబట్టి మిగిలిన వాళ్లు చూసేయొచ్చు). అందులో సినిమా మెయిన్‌ ప్లాట్‌ మాత్రం బయటికొచ్చేసినట్లయింది. ఇప్పుడు ఇదే కథ అంటూ తిరుగుతున్న పోస్ట్‌లో కూడా దాదాపు అదే కథ ఉంది. అయితే ట్రైలర్‌లో ఎండింగ్‌ లేదు. ఇక్కడ ఎండింగ్‌ కూడా రాశారు. వైరల్‌ పోస్ట్‌ ప్రకారం చూసుకుంటే… సినిమాలో విజయ్‌ మాజీ ‘రా’ అధికారిగా కనిపిస్తాడు. ఎందుకు మాజీ అయ్యాడు అనేది ఫ్లాష్‌బ్యాక్ అని, అది పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.

ఇక ట్రైలర్‌లో చెప్పినట్లు చెన్నైలోని ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌ను కొందరు దుండగులు హైజాక్‌ చేస్తారు. తమ నాయకుడిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తారట. దీంతో ఏం చేద్దామా అనుకుంటుండగా.. రెండు ఉపాయాలు కనిపిస్తాయి. ఒకటి ఆ నాయకుడిని విడిచిపెట్టేయడమైతే, రెండోది ఎలాగైనా రెస్క్యూ ఆపరేషన్‌ చేసి లోపల ఉన్న వందల మంది బందీలను బయటకు తీసుకురావడం. అధికారుల బృందంలో కొందరమో రెస్క్యూ ఆపరేషన్‌ అని, ఇంకొందరమో నాయకుడిని ఇచ్చేద్దామని అంటారట.

ఆఖరిగా రెండు పనుల్ని పారలల్‌గా చేయాలని నిర్ణయించుకుంటారు. లోపలకు భద్రతా దళాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో నిరాశపడతారట. సరిగ్గా ఆ సమయంలోనే ఆ బిల్డింగ్‌లో మాజీ ‘రా’ అధికారి అందరూ ‘బీస్ట్‌’ అని పిలుచుకునే హీరో ఉన్నాడని తెలుస్తుంది. దీంతో అతని సాయంతో లోపల బంధీలను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. అయినా బీస్ట్‌ ఎంతో కష్టపడి బందీలను విడిచిపెడతారు. సరిగ్గా అదే సమయంలో నాయకుడిని కూడా విడిపిస్తారు అధికారులు.

దీంతో ప్రజల్ని కాపాడుతూనే, ఆ నాయకుడిని చంపేస్తాడు బీస్ట్‌. ఈ క్రమంలో పూజ – విజయ్‌ మధ్య రొమాన్స్‌, సాంగ్‌లు ఉంటాయట. యోగిబాబుతో కామెడీ సీన్లు కూడా అదిరిపోతాయట. ట్రైలర్‌లో మచ్చుక్కి ఓ కామెడీ సీన్‌ కూడా ఉంది. అయితే నెల్సన్‌ దిలీప్‌ స్క్రీన్‌ప్లే మాయ చేస్తుంది. ఇందులో ఏం చూపించాడు, ఎలా చూపించాడు అనేది కీ పాయింట్‌. అలాగే ఎవరూ ఊహించని సినిమా ఇవ్వడం విజయ్‌ వంతు. సో నెల్సా – విజయ్‌ లెక్క ఏప్రిల్‌ 13న తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus