బాలీవుడ్ భామ పై.. విజ‌య్ సెన్షేష‌న్ కామెంట్స్..!

  • November 26, 2020 / 06:19 PM IST

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం ఫైట‌ర్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది ఫైటర్‌. కోవిడ్ లాక్‌డౌన్ కార‌ణంతా ఈ సినిమా షూటింగ్ కొన్ని నెల‌లు బ్రేక్ ప‌డ‌గా, ఇటీవ‌ల ప‌ర్మిష‌న్లు రావ‌డంతో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ యాభై శాతం కంప్లీట్ అయ్యింద‌ని స‌మాచ‌రం.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ మూవీలో విజ‌య్‌తో రొమాన్స్ చేయ‌డానికి పూరీ బాలీవుడ్ భామ‌ను ఇంపోర్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు చంకీ పాండే కూతురు అన‌న్య పాండె ఈ చిత్రంలో న‌టిస్తోంది. స్టార్ కిడ్స్‌ను వెండితెర పై లాంఛ్ చేయ‌డంలో ముందుండే ప్ర‌ముఖ బాలీవుడ్ మేక‌ర్ క‌రోన్ జోహార్ నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2 చిత్రంలో అనన్య సిల్వ‌ర్ స్కీన్ పై గ్రాండ్‌గానే ఎంట్రీ ఇచ్చింది.

క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వంలో 2012లో వ‌చ్చిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ మూవీ సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన వార‌సులు అలియ భ‌ట్ అండ్ వ‌రుణ్ ధావ‌న్‌లు ఇప్పుడు స్టార్లుగా మారాలు. దీంతో త‌న‌దైన అందంతో క్యూట్‌గా ఉండే అన‌న్యకు కూడా తొలి చిత్రంతోనే బ్రేక్ వ‌స్తుంద‌ని అంద‌రూ ఊహించ‌గా, స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా ప్లాప్ అవ‌డంతో అన‌న్య‌కు పెద్ద‌గా ఫేమ్ రాలేదు.

ఆ త‌ర్వాత హిందీలో ప‌లు చిత్రాల్లో న‌టించినా ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ప‌డ‌లేదు. పైగా ఆమె న‌ట‌న‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. హీరో కూతురు కాబ‌ట్టే అవ‌కాశాలు వ‌స్తున్నాయని, అస‌లు న‌ట‌నే రాద‌ని బిటౌన్ మీడియా వార్త‌లు రాసింది. అయితే తెలుగులో పూరీ ఛాయిస్‌లో భాగంగా ఫైట‌ర్ మూవీలో విజ‌య్‌తో న‌టించే చాన్స్ కొట్టేసింది. అనన్య‌. ఇక తాజాగా ఇంట‌ర్వ్యూలో భాగంగా అన‌న్య ఫెర్ఫార్మెన్స్ ‌పై విజ‌య్ కామెంట్స్ చేశాడు. అన‌న్య సూప‌ర్ ఫెర్ఫామ‌ర్ అని చెబుతూ ఈ ల‌వ్లీ భామ‌ను ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో అన‌న్య‌లో బాలీవుడ్ వాళ్ళ‌కు క‌నిపించ‌ని కొత్త యాంగిల్ విజ‌య్‌కి క‌నిపించింది.. అంత‌లా ఈ రౌడీ హీరోకి అన‌న్య ఏం చూపించి ఉంటుద‌బ్బా అని టాలీవుడ్ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus