సినిమా డిజాస్టర్ అయితే… ఆ ఫలితం ఓ నటుడి మీద, దర్శకుడి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో టాలీవుడ్లో చాలామందికి తెలుసు. రీసెంట్గా ఆ ఎఫెక్ట్‌ని ఫేస్ చేసిన టీమ్ ‘లైగర్’. ‘ఆచార్య’ ఫలితంతో టాలీవుడ్ ఇబ్బందిగా ఉన్న సమయంలో ‘లైగర్’ అంటూ భారీ హైప్‌తో వచ్చి కుదేలయ్యారు. అయితే ఈ సినిమా ఫలితంపై స్పందించడానికి తొలుత హీరో విజయ్ దేవరకొండ నిరాకరించారు. అయితే ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫలితంపై మరోసారి స్పందించాడు. దీంతో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి.
సాధారణ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వడం అంటే చిన్న విషయం కాదు. విడుదలకు ముందే సాధారణ సినిమా పాన్ ఇండియా అయితే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడం చాలా కష్టం. అలా కాకుండా రిలీజ్ అయ్యాక కొద్ది రోజులకు పాన్ ఇండియాగా మారితే ఫర్వాలేదు. తొలి రకంలో పాన్ ఇండియాగా మారిన చిత్రం ‘లైగర్’. దాంతో చిత్రబృందం అదేస్థాయిలో ప్రచారం చేసింది. విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మి అయితే ‘వాట్ లగా దేంగే’, ‘దేశాన్ని షేక్ చేస్తాం’ అంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. తీరా సినిమా వచ్చాక చూస్తే.. హైప్ ఓవర్ హైప్ అయ్యింది.
అయితే విజయ్ దేవరకొండ కష్టానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సినిమా కోసం విజయ్ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డాడు. అయితే ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఆయన ఇబ్బందిపడ్డాడనే చెప్పాలి. ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పెద్ద సినిమాల్లో నటించడమే గొప్ప అవకాశం. నత్తి పాత్రను బాగా ఆస్వాదించా. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దేశమంతా ప్రచారం చేయడం గొప్ప అనుభూతి పంచింది.
‘లైగర్’ సినిమా కోసం మానసికంగా, శారీరకంగా నేను చేయగలిగినదంతా చేశాను. కానీ ఫలితం దక్కలేదు అని అన్నాడు విజయ్ అంతేకాదు తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమే. ఒకవేళ ఎవరైనా తమ తప్పు చేయట్లేదంటే వారు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించడం లేదు అని అర్థం. సక్సెస్ వచ్చినా రాకపోయినా ప్రయత్నాన్ని విరమించకూడదు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ ఆగస్టు ఆఖరున వచ్చి చేదు ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!