Balakrishna, Vijay Devarakonda: ‘అన్‌స్టాపబుల్’ షో.. మూడో గెస్ట్ ఎవరో తెలుసా..?

  • November 14, 2021 / 05:18 PM IST

నందమూరి బాలకృష్ణ ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్’ అనే షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తొలిసారి బాలయ్య హోస్ట్ గా కనిపించడంతో ఈ షోపై ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్లుగానే షోని డిజైన్ చేశారు. పేరున్న తారలను తీసుకొస్తూ.. బాలయ్యతో వారిని ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. దీపావళి నుంచి ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఈ ఎపిసోడ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. రెండో ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు.

ఈ ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ షో వలన ‘ఆహా’ సబ్‌స్క్రైబర్లు బాగా పెరిగారు. తొలిసీజన్ మొత్తం క్రేజీ గెస్ట్ లతో హుషారుగా ఎపిసోడ్లను నడిపించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా విజయ్ దేవరకొండను తీసుకొస్తున్నారట. బాలయ్యతో విజయ్ కి మంచి అనుబంధమే ఉంది. బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్‌తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య ‘లైగర్’ సెట్స్ కు వెళ్లారు బాలయ్య. ఆ సమయంలో విజయ్ తో కాసేపు ముచ్చటించారు బాలయ్య. విజయ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటి వ్యక్తిని బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus