Vijay Devarakonda: గత 10 సినిమాల నుండి విజయ్ దేవరకొండ .. బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉందంటే?
September 2, 2023 / 01:19 PM IST
|Follow Us
విజయ్ దేవరకొండ.. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ఆర్డర్లో ఉన్నాడు. ‘పెళ్ళిచూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి హిట్ చిత్రాలతో ఇతను సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పలు ఫెయిల్యూర్స్ ఎదురైనా.. ఇతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. గత 10 సినిమాలుగా విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
1) పెళ్ళి చూపులు :
విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.1.57 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.15.73 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.14.16 కోట్ల భారీ లాభాలతో ఎపిక్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
2) ద్వారక :
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.1.87 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
3) అర్జున్ రెడ్డి :
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో ఏకంగా రూ.25 కోట్ల షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
4) ఏ మంత్రం వేసావే :
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో ఏకంగా రూ.0.40 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
5) గీత గోవిందం :
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో ఏకంగా రూ.70.60 కోట్ల షేర్ ను రాబట్టి.. దాదాపు రూ.55 కోట్ల భారీ లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
6) నోటా :
విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.9.4 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. దాదాపు రూ.13 కోట్ల భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
7) టాక్సీ వాలా :
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. దాదాపు రూ.14 కోట్ల భారీ లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
8) డియర్ కామ్రేడ్ :
విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.21 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. దాదాపు రూ.13 కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా మిగిలింది.
9) వరల్డ్ ఫేమస్ లవర్ :
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.10.01 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. దాదాపు రూ.20 కోట్ల నష్టాలతో పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
10) లైగర్ :
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.82.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.27.64 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.57.36 కోట్ల నష్టాలను మిగిల్చి ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలింది.