నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకొన్న మైత్రీ మూవీ మేకర్స్
August 12, 2019 / 03:44 PM IST
|Follow Us
విజయం ఎంతటి గర్వం తెచ్చిపెడుతుందో తెలియదు కానీ.. పరాజయం మాత్రం అంధ పాతాళానికి తొక్కేస్తుంది. “అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా” లాంటి సెన్సేషల్ హిట్స్ తన ఖాతాలో ఉన్నా.. “డియర్ కామ్రేడ్” కారణంగా వచ్చిన డిజాస్టర్ కారణంగా ఊహించని స్థాయి నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తోంది విజయ్ దేవరకొండకి. “డియర్ కామ్రేడ్” విడుదలవ్వకముందే “హీరో” అనే ప్రాజెక్ట్ ను మొదలెట్టాడు విజయ్. “డియర్ కామ్రేడ్” ఫార్మాట్ లోనే ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రం ఒక షెడ్యూల్ అనంతరం ఆగిపోయిందని తెలుస్తోంది.
ఇప్పటివరకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన ఫస్ట్ షెడ్యూల్ అవుట్ ఫుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడమే కాక.. ఖర్చు కూడా అనుకున్నదానికి మూడు రేట్లు ఎక్కువైయింది. దాంతో నిర్మాణ బాధ్యతల నుంచి మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకొన్నారని సమాచారం. ఈవార్త గనుక నిజమైతే.. విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డౌన్ ఫాల్ గా ఈ విషయాన్ని పేర్కొనవచ్చు.