పోలిటికల్ ఫీవర్ ఫేస్ చేస్తున్న విజయ్ దేవరకొండ

  • September 26, 2018 / 09:47 AM IST

కొన్నాళ్ళకి విజయ్ దేవరకొండ సినిమా ఎలాంటి ఇష్యూస్ లేకుండా రిలీజ్ అవుతుందంటే ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంటుందేమో. “అర్జున్ రెడ్డి” మొదలుకొని “ద్వారక, గీత గోవిందం” ఇలా ప్రతి సినిమాకి విజయ్ దేవరకొండ ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేశాడు. ఇప్పుడు తాజా చిత్రం “నోటా” రిలీజ్ విషయంలో కూడా విజయ్ దేవరకొండకి తిప్పలు తప్పేలా లేవు. అందుకు కారణం పాలిటిక్స్ కానుంది. పోలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలకానుంది. ఈ చిత్రంలో పాలిటిక్స్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలున్నాయట.

వాటిలో ముఖ్యంగా జయలలిత హాస్పిటల్ లో మరణించే ఎపిసోడ్ ఉండబోతోందట. ఈ సన్నివేశం ఇప్పుడు “నోటా” ఫిలిమ్ కి అడ్డంకిగా మారానుంది. ఇంకా సెన్సార్ కంప్లీట్ అవ్వని ఈ సినిమాకి ఈ సీన్ ఏమైనా ఇష్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అంశాలను కూడా ఈ సినిమాలో పొందుపరిచారట. సొ, సినిమా రిలీజ్ అయ్యాక లేదా రిలీజ్ కి ముందు “నోటా”కి రాజకీయ సెగ తగలడం ఖాయమని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus