Vijay, Samantha: విజయ్ – సమంత ‘ఖుషి’ అలా ముగిస్తారా!
October 18, 2022 / 12:22 PM IST
|Follow Us
టాలీవుడ్ సినిమా అంటే ఓ లెక్క ఉంది. సినిమా ఇలానే ఉండాలి, ఇలానే ఉంటే చూస్తాం అని ప్రేక్షకులు అనకపోయినా.. కొన్ని రకాల సినిమాలు చూడరు. పక్క పరిశ్రమలో హిట్ అయ్యింది కదా అని సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్లాట్, సేమ్ క్లైమాక్స్ తీసుకుంటాం అంటే ప్రేక్షకులు ఓకే అనరు. గతంలో ఇలా వచ్చిన సినిమాలు చాలావరకు పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా శాడ్ క్లయిమాక్స్‌లు మనకు అస్సలు అచ్చిరావు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తెలుగులో ఓ సినిమాకు శాడ్ ఎండింగ్ ఉండబోతోంది అని టాక్.
విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్లో శివ నిర్వాణతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అదే ‘ఖుషి’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్లయిమాక్స్ విషాదాంతం అని తెలుస్తోంది. సినిమా ప్రారంభంలోనే ఆ సన్నివేశాలు చూపించి, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ రూపంలో మిగిలిన సీన్స్ చూపించేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నారట. దీంతో విషాదాంతం కానీ.. విషాదాం కాదు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో టీమ్ ఫైనల్ డెసిషన్ తీసుకుందా లేదా అనేది చూడాలి.
ఇక సినిమా పేరుకు తగ్గట్టే మంచి ప్రేమకథ అంటున్నారు. శివ నిర్వాణ ఇలాంటి హార్ట్ టచింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. అయితే ఆయన సినిమాల్లో ప్రేమలో విఫలం అనేది ఉంటుంది కానీ, జీవితంలో ఫెయిల్యూర్ ఉండదు. మరి ‘ఖుషి’లో శాడ్ ఎండింగ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. తెలుగులో అయితే ఇలాంటి కథలకు ఆదరణ తక్కువే. మహేష్‌బాబు ‘బాబి’, అల్లరి నరేశ్ ‘ప్రాణం’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ లాంటివి ఇలాంటి శాడ్ ఎండింగ్‌తో వచ్చిన రీసెంట్ సినిమాలు. ఈ మూడు ఫలితాలు మీకు తెలిసినవే.
మరి పాత సినిమాల ఫలితాలు తెలిసి కూడా శివ నిర్వాణ ఎందుకు శాడ్ ఎండింగ్ అనుకుంటున్నారో చూడాలి. సినిమా కథకు అవసరమా అంటే.. దాన్ని బాగా హ్యాండిల్ చేయాలి. ‘టక్ జగదీష్’ లాంటి ఇబ్బందికర ఫలితం (సినిమా హిట్ అని నాని అంటారు అనుకోండి) అందుకున్న తర్వాత ఇలాంటి ప్రయోగం ఎంతవరకు ఓకేనో శివ నిర్వాణనే చెప్పాలి.