సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని మాత్రం ఊహించలేదు : విజయ్ దేవరకొండ
July 8, 2020 / 12:04 PM IST
|Follow Us
“అర్జున్ రెడ్డి చిత్రం, ఆ చిత్ర విజయం.. ఒక నటుడిగా నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. నా ఇమేజ్ ను పెంచింది, కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకొనేలా చేసింది, ప్రపంచానికి నన్ను కొత్తగా పరిచయం చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా నా రెమ్యూనరేషన్ ని నేను డిసైడ్ చేసుకొనేలా చేసింది. ఇప్పుడు “మహానటి”లో నేను పోషించిన విజయ్ ఆంటోనీ అనే పాత్ర నాకు ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుంది అనే విషయం నేను పట్టించుకోవడం లేదు, ఆ కథకి నా పాత్ర, నా నటన ఎంతవరకూ ఉపయోగపడింది అనే విషయాన్ని మాత్రమే నేను పరిగణలోకి తీసుకొంటున్నాను” అంటున్నాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. రేపు తన పుట్టినరోజు మరియు “మహానటి” చిత్ర విడుదలను పురస్కరించుకొని తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమా కెరీర్ గురించి, యాటిట్యూడ్ ఇష్యూస్ గురించి పాత్రికేయులతో ముచ్చటించాడు.
నాలో చాలా మార్పులొచ్చాయి…“అర్జున్ రెడ్డి” విజయం తర్వాత నాలో ఏం మార్పు వచ్చింది అని అడిగితే.. చాలా వచ్చాయి అనే చెబుతాను. నేను ఇంటర్ లో ఉన్నట్లు, డిగ్రీకి వచ్చాక లేను. అలానే “ఎవడే సుబ్రమణ్యం” సినిమా టైమ్ లో ఉన్నట్లు “అర్జున్ రెడ్డి” తర్వాత లేను. అయితే.. వచ్చిన మార్పులన్నీ నా శారీరకంగా లేదా స్టేటస్ పరంగా వచ్చినవే తప్ప మానసికంగా నాలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇక “అర్జున్ రెడ్డి” సినిమా విజయం సాధిస్తుంది అని ఊహించాను కానీ.. మరీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు.
జనాలు నన్ను చూసే పద్ధతి మారింది..మోడీగారు డీమానిటైజేషన్ ఎనౌన్స్ చేసినప్పుడు “దిస్ మ్యాన్ గాట్ బాల్స్” అని స్టేటస్ అప్డేట్ చేశాను. అప్పుడు నన్ను ఒక సామాన్యుడిగా చూశారు కాబట్టి నేను అన్న మాటలకి పెద్దగా వేల్యూ ఇవ్వలేదు. కానీ.. నేను అందరికీ ఒక స్టార్ హీరోగా పరిచయమయ్యాక నేను సావిత్రిగారిని “చిక్” అనడం కూడా తప్పయిపోయింది. అందుకే ఆ ఇష్యూని అంత సీరియస్ గా తీసుకొని హడావుడి చేశారు. ఇక్కడ మారింది నా యాటిట్యూడ్ కాదు, జనాలు నన్ను చూసే పద్ధతి.
నేను బాధ్యత వహించలేను..సినిమాలో నటించడం, కుదిరినంతలో ప్రమోట్ చేయడం వరకే నాకు తెలిసిన విషయం. సినిమా రిజల్ట్ ఏంటి? జనాలు ఎలా రిసీవ్ చేసుకొన్నారు? అనే విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను. సినిమా రిజల్ట్ విషయంలో నేను బాధ్యత వహించాలి అని కూడా అనుకోను. ఎందుకంటే ఏ విషయానికైనా సరే బాధ్యత వహించడం అనేది నాకు నచ్చదు.
నన్ను సావిత్రిగా నటించమంటున్నారేమో అనుకున్నా..“అర్జున్ రెడ్డి” షూటింగ్ లో ఉన్నప్పుడు స్వప్న అక్క ఫోన్ చేసి “సావిత్రి బయోపిక్ తీస్తున్నాం.. నువ్ యాక్ట్ చేయాలి” అని చెప్పింది. నేను నన్ను “సావిత్రి”గా యాక్ట్ చేయమని అడుగుతున్నారేమో అనుకొని.. “ఒకే నేను సావిత్రిగారిలా గెటప్ వేసుకుంటాను కానీ.. జనాలు చూస్తారా?” అని అడిగాను. గట్టిగా నవ్వేసింది అక్క.
నాగి కోసం మాత్రమే ఈ సినిమా చేశాను..నా మనసుకి దగ్గరైన దర్శకుడు నాగి, నాకు అక్కలాంటి స్వప్న అడిగారు కాబట్టే “మహానటి”లో విజయ్ ఆంటోనీ రోల్ చేయడానికి అంగీకరించాను తప్పితే.. వేరే ఎవరైనా ఇదే సినిమా కోసం అప్రోచ్ నిస్సంకోచంగా నో చెప్పేవాడిని. ఈ సినిమాలో నా పాత్ర పెద్దదేమీ కాదు. సమంత క్యారెక్టర్ కు బ్యాక్ బోన్ లా ఉంటుంది అంతే.
సమంతతో కలిసి నటిస్తానని ఊహించలేదు..నేను హీరో అవ్వడానికి ముందెప్పుడూ కూడా ఫలానా హీరోతో నటించాలి, ఫలానా హీరోయిన్ తో కలిసి నటించాలి అని మాత్రం ఎప్పుడూ బకెట్ లిస్ట్ లాంటిది తయారు చేసుకోలేదు. ముఖ్యంగా సమంతతో కలిసి నటిస్తాను అని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. తను నాకన్నా సీనియర్.. సో జూనియర్, జూనియర్ అంటూ ఆటపట్టించేది.
ఆ రోల్ చేయమని అడగ్గానే నాకు ప్యాక్ అయిపోయింది..అప్పటికే నేను “మహానటి”లో విజయ్ ఆంటోనీ రోల్ చేశాను. సడన్ గా నాగి ఒకరోజు కాల్ చేసి “నాకు జెమిని గణేషన్ రోల్ కి దుల్కర్ డేట్స్ సెట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలి” అన్నాడు. నాకు ప్యాక్ అయిపోయింది. జెమిని గణేష్ సినిమాలు కొన్ని చూశాను. పొరపాటున కూడా ఆయనలా నటించలేని అని అర్ధమైపోయింది. కానీ.. చేయలేను, నో అని చెప్పలేను. ఎలా మేనేజ్ చేయాల్రా బాబు అని మాధానపడుతున్న తరుణంలో.. మళ్ళీ నాగి సడన్ గా కాల్ చేసి “దుల్కర్ డేట్స్ సెట్ అయిపోయాయి” అని చెప్పాడు. బ్రతికిపోయాన్రా బాబు అనుకున్నాను.
40 ఏళ్ల అర్జున్ రెడ్డి ఎలా ఉంటాడు అనే ఆలోచన..“అర్జున్ రెడ్డి” హిట్ అయ్యాక ఆ సినిమాకి సీక్వెల్ తీయాలి అన్న ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకొని, ఒక అమ్మాయి పుట్టి, ఫ్యామిలీ మ్యాన్ లా బ్రతుకుతున్నప్పుడు అదే రకమైన యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే.. వాడి కూతురు ప్రేమలో పడినప్పుడు అర్జున్ రెడ్డి ఎలా బిహేవ్ చేస్తాడు? అనే ఆలోచనతో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. అయితే.. అది అప్పుడే కాదు.. కొన్నేళ్లు ఆగిన తర్వాత మొదలెడతాను.
కాకినాడ స్లాంగ్ ను ఎలా రిసీవ్ చేసుకొంటారో..బేసిగ్గా తెలంగాణ స్లాంగ్ నాకు బిగ్గెస్ట్ ఎస్సెట్. అయితే.. మొదటిసారిగా “డియర్ కామ్రేడ్” అనే చిత్రం కోసం కాకినాడ స్లాంగ్ ట్రై చేశాను. బిగ్ బెన్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రేపు విడుదలవుతుంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయంగా ఉన్నప్పటికీ.. “ట్యాక్సీవాలా” ఆ టెన్షన్ ను తగ్గిస్తుందని అనుకొంటున్నాను.