ఈసారి పోలిటికల్ ఫిలిమ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాడట
July 7, 2018 / 10:40 AM IST
|Follow Us
ఈమధ్యకాలంలో స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ లాంటివి ఏమీ లేకుండా కేవలం పోషించిన పాత్రతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొని.. వారిని తన వీరాభిమానులుగా మార్చేసుకొన్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం మనోడికి మామూలు క్రేజ్ లేదు. అందుకే ఎంపిక చేసుకొనే సినిమాల విషయంలోనూ పలు జాగ్రత్తలు వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన “ట్యాక్సీవాలా” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుండగా.. “గీత గోవిందం” ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ పద్ధతిగల అబ్బాయిగా కనిపించనున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించడం విశేషం.
ఈ సినిమాతోపాటు తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న “నోటా” అనే ద్విభాషా చిత్రంలోనూ విజయ్ నటిస్తున్నాడు. పోలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని వినికిడి. ఇటీవల “భరత్ అనే నేను”లో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించిగా.. ఇప్పుడు విజయ్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రిగా కనిపించనుండడంతో “నోటా” సినిమాకి క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అక్టోబర్ లేదా డిసెంబర్ లో “నోటా” ప్రేక్షకుల ముందుకు రానుంది.